అన్నంత పనీ చేసిన ట్రంప్

0
640
trump had stopped h1b visas

Posted [relativedate]

trump had stopped h1b visasమొండోడు మంకు పట్టు వదలడని ట్రంప్ నిరూపించారు. తీవ్ర నిరసన వ్యక్తమైనా, కోర్టులు వద్దన్నా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం పెట్టేశారు. దీంతో హెచ్ 1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి. భారతీయులు అమెరికా వెళ్లాలంటే ఇక చుక్కలు కనిపించడం ఖాయం. అధిక జీతాలు ఇప్పించాలని ఈ పని చేశానని కవర్ చేసుకుంటున్న ట్రంప్.. అసలు విషయాన్ని మాత్రం దాచిపెడుతున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో గద్దెనెక్కిన ట్రంప్.. ఇప్పుడు ఉద్యోగాలు కూడా ముందు అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు.

అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని, అధిక వేతన, అధిక ఉపాధి లక్ష్యమని ట్రంప్ ప్రకటించారు. అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే వీసాలివవ్వాలని ఇప్పటికే ఫెడరల్ రూల్స్ రెడీ అయ్యాయి. ప్రత్యేక విధులకు మాత్రమే ఈ వీసాలు కేటాయిస్తారు. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధన ప్రకారం ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండాలి. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, కంప్యూటర్ ప్రోగ్రామర్లకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు. 65వేల వీసాలు జారీ చేయడానికి లాటరీ విధానాన్ని ట్రంప్ సర్కారు ఎన్నుకుంది. మరో 20వేల స్టూడెంట్ వీసాలు కూడా ఇస్తారు.

ఈ ఏడాది హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత ఏడాది 2,36,000 ఉండగా.. ఈ సారి 1,99,000లకు మాత్రమే పరిమితమైంది. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న వారిని నియమించుకోవడానికే హెచ్‌1బీ వీసాలను వినియోగిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. ఫేస్‌బుక్‌ వంటి కంపెనీల్లో 15 శాతం మంది ఉద్యోగులు ఈ తాత్కాలిక వీసాలనే వినియోగించుకుంటున్నారు. తాజా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో తమ కలల జాబితాలో నుంచి యూత్ అమెరికాను డిలీట్ చేసేయక తప్పేలా లేదు.

Leave a Reply