ట్రంప్ గుడ్డలిప్పేశారు..

0
576

 trump nude statuesరిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహం ఒకటి న్యూయార్క్‌లో కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఏర్పాటు చేసిన ఈ ట్రంప్ నగ్న విగ్రహాన్ని చూసి జనం బిత్తరపోయారు. కొందరు మాత్రం ఎప్పటిలాగే ఫోన్లు తీసి విగ్రహంతో సెల్ఫీల పనిలో పడ్డారు. ఉదయాన్నే ఆ మార్గం గుండా వెళ్తూ.. బెల్లీ ఫ్యాట్, ఎల్లో హెయిర్‌తో కనిపిస్తున్న ఈ విగ్రహాన్ని చూసిన జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ తన వెబ్‌సైట్‌లో ట్రంప్ విగ్రహ తయారీకి సంబంధించిన వీడియోను ఉంచింది. అయితే ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం సీరియస్‌గా ఉన్నారు. న్యూయార్క్ నగరంలోని సిటీ స్క్వేర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని అధికారులు వెంటనే తొలగించారు.

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బిలియనీర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌కు చేదు అనుభవం ఎదురైంది. దుస్తులు లేకుండా ఉన్న ట్రంప్‌ విగ్రహాలు అమెరికాలోని పలు నగరాల్లో దర్శనమిచ్చాయి. న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్‌కో, లాస్‌ఏంజిల్స్‌, క్లీవ్‌ల్యాండ్‌, సియాటెల్‌ నగరాల్లో బహిరంగ ప్రాంతాల్లో ట్రంప్‌ విగ్రహాలు ఇలా కనిపించే సరికి ప్రజలు గుమిగూడి ఫొటోలు తీసుకున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ‘ఇన్‌డిక్లైన్‌ యాక్టివిస్ట్‌ కలెక్టివ్‌’ వారు ఇలా విగ్రహాలను ఏర్పాటు చేశారు. వాటి వద్ద ‘ద ఎంపరర్‌ హాజ్‌ నో బాల్స్‌’ అని రాశారు. అధికారులు స్పందించి ట్రంప్‌ విగ్రహాలను ధ్వంసం చేసి బహిరంగ ప్రాంతాల నుంచి తొలగించారు

Leave a Reply