అమ్మ‌కానికి ట్రంప్ ఫోన్!!

0
493
trump phone sale

Posted [relativedate]

trump phone sale
అమెరికా అధ్య‌క్ష పీఠ‌మెక్క‌బోతున్న డొనాల్డ్ ట్రంప్ ఫోన్ అమ్మ‌కానికి వ‌చ్చింది. మీరు విన్న‌ది నిజ‌మే. అదేంటి ట్రంప్ ద‌గ్గ‌ర డ‌బ్బులైపోయాయా… అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టి లాస్ అయిపోయాడా.. అని అనుమాన‌ప‌డ‌కండి.. ఫోన్ అమ్ముతున్న‌ది ట్రంప్ కాదు. ఓ ప్రైవేటు సెల్ ఫోన్ కంపెనీ. ఇదేంటి సెల్ ఫోన్ కు.. ట్రంప్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. అయితే డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే.

కొన్ని రోజుల కింద చైనాకు చెందిన మ‌హిళ‌… దుబాయ్ లో షాపింగ్ కు వెళ్లింది. ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం రోజున బ‌హుమ‌తిగా ఇచ్చేందుకు ఆయ‌న ముఖంతో కూడిన ప‌రికరం కావాల‌ని అడిగింద‌ట‌. స‌రిగ్గా ఈ ఆలోచ‌న‌కు వాస్త‌వ రూపం ఇచ్చింది గోల్డ్ జెనీ అనే సంస్థ‌.
బంగారంతో పొదిగిన‌.. ట్రంప్ ముఖ‌చిత్రం ఉన్న ఐఫోన్ ను గోల్డ్ జెనీ కంపెనీ మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఈ ఫోన్ లో అన్నీ వజ్రాల‌ను పొదిగార‌ట‌. ఇంత‌కు దీని ఖ‌రీదెంతో తెలుసా… అక్ష‌రాలా కోటి రూపాయాలు.. ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి ఫోన్లు 9 అమ్ముడుపోయాయ‌ట‌. రానున్న రోజుల్లో దీని అమ్మ‌కాలు మ‌రింత పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని కంపెనీ చెబుతోంది.

ఈ ఫోన్ మార్కెట్లోకి వ‌చ్చిన‌ట్టు అమెరికన్ల‌కు తెలియ‌లేదేమో. లేక‌పోతే ట్రంప్ పార్టీకి చెందిన నాయ‌కులు ఈ ఫోన్ల కోసం ఎగ‌బ‌డ‌డం ఖాయం. ఎందుకంటే ట్రంప్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయాలంటే వారికి ఇంత‌కంటే మంచి అవ‌కాశం మ‌ళ్లీ రాదు.

Leave a Reply