Wednesday, December 8, 2021
Homelatestరోజుకో రూల్ తో పిచ్చెక్కిస్తున్న ట్రంప్

రోజుకో రూల్ తో పిచ్చెక్కిస్తున్న ట్రంప్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పిచ్చి ముదిరింది.. రోకలికి చుట్టండి అన్నట్లుండి ట్రంప్ దొరవారి రాజరికం. అమెరికా మూల సిద్ధాంతాల్నే విస్మరిస్తూ.. వీసాల విషయంలో ట్రంప్ చేస్తున్న రాద్ధాంతం చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది. నిన్నటికి నిన్న సోషల్ మీడియా హిస్టరీ చూసే వీసాలిస్తామన్న ట్రంప్.. ఈసారి మరో బాంబ్ పేల్చారు. ఉన్నత విద్య పేరుతో వీసా తీసుకుని అగ్రరాజ్యం తిష్టేయడం ఇక కుదరని పని. సదరు అభ్యర్థి విద్యాభ్యాసం చేసిన విద్యాసంస్థ యునైటెడ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనుమతి లేకపోతే వీసా రాదు.

సాధారణంగా మన దేశంలో ఉన్నత విద్యామండలి గుర్తింపు ఉన్న సంస్థలే అధికారికం కింద లెక్క. మిగతా వన్నీ అన్ అఫిషియలే. ఇప్పుడు అమెరికాలో కూడా అంతే. యునైటెడ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గుర్తిస్తేనే.. ఆ డిగ్రీలకు విలువ ఉంటుంది.లేకపోతే చెత్తబుట్టలో పారేయాల్సింది. అనుమతి లేకపోతే.. కనీసం కోర్సు పూర్తయ్యే సరికి పూర్తిస్థాయి అనుమతి వచ్చేలా ముందస్తు అనుమతి అయినా ఉండటం తప్పనిసరి. లేదంటే సదరు విద్యార్థులంతా తట్టాబుట్టా సర్దుకుని అమెరికా వదలాల్సిందే.

అమెరికాలో పారిశ్రామికీకరణ సంపద సృష్టిస్తే.. ఇండియాలో అమెరికా హెచ్ 1 బీ వీసా సంపద సృష్టించింది. అందుకే భారతీయులు అప్పనంగా తమ సొమ్ము దోచేస్తున్నారని అమెరికన్లు తెగ అసూయ పడుతున్నారు. వారి వాదనకు బలం చేకూరుస్తూ ట్రంప్ సర్కారు.. బంగారు బాతుగుడ్డు లాంటి వీసాను ఎవరికీ అందనంత ఎత్తున నిలబెడుతోంది. ముఖ్యంగా భారతీయులకు వీలైనంత కష్టంగా వీసాల విధానం ఉండాలని ట్రంప్ అంతర్గత ఆదేశాలు కూడా ఇచ్చేశారన్న మాట మరింత ఆందోళన కలిగిస్తోంది.

- Advertisment -
spot_img

Most Popular