ట్రంప్ కాపురాలు కూల్చేస్తున్నాడు..

0
330
trump reason for love breakups

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

trump reason for love breakups
ట్రంప్ రగిల్చిన చిచ్చుతో ఇప్పటికే ఐటీ రంగ నిపుణులు హాహాకారాలు చేస్తున్నారు.ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధం అయినప్పటినుంచి అధ్యక్షుడుగా ఎన్నికైన దాకా ప్రతీది సంచలనమే.ఆయన గెలుపుని కూడా ఎవరూ ఊహించలేదు.గెలిచాక ఆయన తీసుకునే నిర్ణయాలు ఎవరి ఊహకు అంతుపట్టలేదు.అందుకే ఉద్యోగ కల్పన, వలస విధానాల్లో ఆయన చేసిన మార్పులతో ఎన్నోదేశాలు సుడిగుండంలో చిక్కుకుపోయినట్టు దారీతెన్నూ తెలియకుండా తిరుగుతున్నాయి.ఆ ప్రభావం ఇప్పటికే మన ఇండియాలో కూడా మొదలైపోయింది.నిన్నటిదాకా సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ అని కాలర్ ఎగరేసి కనిపించేవాళ్ల మొహాలు కాస్త దిగాలుగా కనిపిస్తున్నాయి.ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంతకుమించిన ఉత్పాతం అమెరికన్ కాపురాల్లో సృష్టిస్తున్నాడు ట్రంప్.అదేంటో చూద్దామా ..

ట్రంప్ అమెరికాలో కాపురాలు కూల్చేస్తున్నాడు.ప్రేమికుల మధ్య నిప్పురాజేసి తమాషా చూస్తున్నాడు.ఇదేమీ సరదాగా చెప్పుకుంటున్న విషయం కాదు .వేక్ ఫీల్డ్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది.ట్రంప్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిన సందర్భంగా విడాకులు తీసుకున్న, ప్రేమకి బ్రేక్ అప్ చెప్పుకున్న వెయ్యిమందిని ప్రశ్నించింది.వారి గొడవలకి,విడాకులకు కారణం ఏంటని అడిగితే వారిలో 22 శాతం మంది ట్రంప్ గురించి వాదులాట వల్లే తాము విడాకులు తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.ఇక ప్రేమికుల మధ్య కూడా ట్రంప్ గురించి వాదులాటతో బ్రేక్ అప్స్ జరిగినట్టు తేలింది.ఇక ఇంతటితో ఆగిపోలేదు ట్రంప్ గారి మాయాజాలం. కాపురాలు చేసుకుంటున్నవాళ్ళు కూడా ట్రంప్ దెబ్బకి కొట్టుకుంటూ వుంటున్నారు.ఈ విషయాలు ఎవరైనా బయటికి చెపితే పోదురు బడాయి అనుకోవచ్చు.కానీ ఓ సర్వే సంస్థ ముందుకొచ్చి తేల్చడంతో ట్రంప్ గారి లీలలు ఈ స్థాయిలోనా అని ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply