ట్రంప్ మారాడా?

0
309
trump response on kuchibhotla srinivas murder

Posted [relativedate]

trump response on kuchibhotla srinivas murder
డోనాల్డ్ ట్రంప్…అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులోకి వచ్చినప్పటినుంచి అమెరికన్ల సెంటి మెంట్ రెచ్చగొడుతూనే వున్నారు.ఇదంతా ఎన్నికల స్టంట్ …ఆ వ్యవహారం పూర్తి అయ్యేసరికి ఆయన మాట మారుతుంది.తీరు తిరగబడుతుంది అని అనుకున్నారు.అధ్యక్ష పీఠం ఎక్కినా ట్రంప్ వైఖరి మారలేదు.దీంతో యావత్ ప్రపంచం భయపడి పోయింది .పదవిలోకి వచ్చాక విధానపరమైన నిర్ణయాల్లోను ఎన్నికల ప్రచారంలో చెప్పిందే చేసాడు ట్రంప్.ఇది ఊహించని పరిణామమే.రాజకీయ పార్టీలు ,నేతలు ఎన్నికల ముందు,వెనుక ఒకే మాట చెప్పడం ఆశ్చర్యకరమే.అయితే తన విధానాలతో అమెరికాలో జాత్యహంకారం ప్రబలితే ట్రంప్ ఎలా స్పందిస్తాడో అన్న సందేహం వుంది.

ఓ జాత్యహంకార అమెరికన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు వాడు కూచిబొట్ల శ్రీనివాస్ విషయంలో ట్రంప్ స్పందన మాత్రం అధ్యక్ష పదవికి తగ్గట్టే వుంది.ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు పోకుండా అది జాత్యహంకార హత్యేనని ఒప్పుకున్నాడు.అమెరికాలో వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా ఎవరికైనా భద్రత కల్పిస్తామని చెప్పడంతో పాటు ….జాతి విద్వేషానికి అమెరికాలో స్థానం లేదని ట్రంప్ ప్రకటించారు.జాతి విద్వేషాన్ని తప్పుబడుతూ ట్రంప్ చేసిన ప్రకటన యావత్ ప్రపంచానికి కొంత ఊరట కలిగించింది.దీంతో ట్రంప్ మారాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.అది నిజమో కాదో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది.

Leave a Reply