ఆమెకి ‘ట్రంప్’ కార్డు వేసి దొరికిపోయాడు..

Posted October 8, 2016

 trump sex videos reveals nbc channel
నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అడ్డంగా దొరికిపోయాడు.ఇప్పుడు కాదు లెండి..ఓ పదేళ్ల కిందట అయ్యగారు వేడెక్కిపోయి ఓ వివాహితతో చేసిన సంభాషణ బయటపడింది.2005 లో ఓ పెళ్ళైన మహిళను తనతో సెక్స్ కి ప్రేరేపిస్తూ అంగాంగ వర్ణన చేస్తున్న దృశ్యాల్ని nbc ఛానల్ విడుదల చేసింది.దీంతో ఇప్పటిదాకా డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ భర్త క్లింటన్ గురించి పదేపదే మాట్లాడే ట్రంప్ నోరు మూతపడింది.ఎప్పుడు లేంది అయన క్షమాపణ కూడా చెప్పాడు.పైగా ఆ విషయం గురించి మాట్లాడుతూ మనిషన్న వాడు ఎప్పుడో ఓ సారి తప్పు చేయకుండా ఉంటాడా?అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు.నిజమే మనిషన్నవాడు తప్పులు చేస్తాడు.కానీ మనుషులంతా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడరు కదా.దానికి కొన్ని అర్హతలుండొద్దా ట్రంప్?

SHARE