వారు నవ్వుతుంటే ట్రంప్ మొహం మాడింది..

 Posted October 20, 2016

trump speech american people laughing at debate
మన ప్రవర్తన బట్టే ఎదుటివారి నుంచి మర్యాద,మన్నన లభిస్తాయి.మనం ఏమి చేసినా చెల్లుతుంది అనుకునేవారు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్ అనుభవం చూస్తే సరి.ఒక్కసారి నమ్మకం కోల్పోతే ఎలాంటి చేదు అనుభవం ఎదుర్కోవాలో అర్ధమవుతుంది.

అమెరికా ప్రెసిడెన్షియల్ డిబేట్ తుది ఘట్టంలో ట్రంప్ కి ప్రేక్షకుల నుంచి అవమానం తప్పలేదు. మాహిళలతో వ్యవహరించే తీరు,లైంగిక వేధింపులు గురించి హిల్లరీ లేవనెత్తినపుడు ట్రంప్ దానికి సమాధానమిచ్చాడు.మహిళలంటే తనకి అపార గౌరవం ఉందని,తనపై హిల్లరీ ప్రోత్సాహం తోటే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ సమాధానమిస్తుంటే జనం పగలబడి నవ్వారు.అయన ఈ అంశం గురించి మాట్లాడినప్పుడల్లా ప్రేక్షకులు నవ్వడంతో ట్రంప్ మొహం మాడిపోయింది.ప్రేక్షకుల్ని ఊరుకోబెట్టడానికి చర్చ సంధానకర్త కష్టపడాల్సి వచ్చింది.

SHARE