ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ కొట్టేసిన ట్రంప్!!!

0
256

Posted [relativedate]

trump take charge as 45th american president
అగ్ర‌రాజ్యం అమెరికాకు కొత్త అధ్య‌క్షుడొచ్చేశాడు. డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రెసిడెంట్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. అమెరికాకు 45వ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ట్రంప్ తో ప్రమాణస్వీకారం చేయించారు. అబ్రహం లింకన్ ఉపయోగించిన బైబిల్‌పై చేతిని ఉంచి ఆయ‌న‌ ప్రమాణం చేశారు. ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు జార్షి బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామాతో పాటు హిల్లరీ క్లింటన్, త్రివిధ దళాల అధికారులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం నేపథ్యంలో శ్వేతసౌధం పరిపరాలు ప్రజలతో నిండిపోయాయి. అట్ట‌హాసంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమాన్ని వాషింగ్టన్‌లోనే ఉన్న నేషనల్ మాల్‌లో గుమిగూడిన దాదాపు 8 లక్షల మంది తిలకించారు.

బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ట్రంప్ ప్ర‌సంగం ఆక‌ట్టుకుంది. మొత్తం 16 నిమిషాల పాటు త‌న స్పీచ్ లో అన్ని అంశాల‌ను క‌వ‌ర్ చేశారాయ‌న‌. అమెరిక్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఆయ‌న ఎక్కువ ఇంపార్టెన్స్ చేశారు. అమెరికానే ఫస్ట్ అనే నినాదంతోనే తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్ప‌డం ద్వారా అమెరిక‌న్ల దృష్టిలో ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ కొట్టేశారు. దేశానికి పునర్వైభవం తీసుకురావటమే తమ లక్ష్యమని ప్రకటించి చప్పట్ల మోత మోగించారు. బై అమెరికన్..హైర్ అమెరికన్ అంటూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అమెరిక‌న్ల‌నూ ప్ర‌స‌న్నం చేసుకుంటూనే ఇత‌ర దేశాల‌కు హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు ట్రంప్. ప్రధానంగా ఐసిస్ టెర్రరిజాన్ని తరిమికొడతామని హెచ్చరించి స్ట్రాంగ్ సిగ్న‌ల్స్ పంపారు. వివిధ దేశాలతో పాత పొత్తులను బలోపేతం చేస్తూ.. కొత్త ఒప్పందాలతో నాగరిక ప్రపంచాన్ని ఐక్యంచేసి రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని అంతం చేస్తామని ప్ర‌తిన బూనారు. దీంతో పాటూ గత కొన్నేళ్లుగా ఉద్యోగాలు పోగొట్టుకున్న అమెరిక‌న్ల ఉద్యోగాలు తిరిగి వెనక్కి రప్పిస్తామంటూ హామీ ఇచ్చి… అమెరికా వైపు చూస్తున్న విదేశీయుల గుండెల్లో గుబులు పుట్టించారు. ఇక తమ ప్రతి నిర్ణయం వారి కలలను నిజం చేసే దిశగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

ట్రంప్ ప్రసంగం అమెరిక‌న్ల‌ను ఆక‌ట్టుకుంది కానీ… భార‌త్ తో పాటు ప‌లు దేశాల‌కు మింగుడుపడేలా లేదు. ఆయ‌న ఉద్యోగాలు ముందు అమెరిక‌న్ల‌కే..ఆ త‌ర్వాతే ఇత‌రుల‌కు చెప్ప‌డం భార‌త్ కు హెచ్చరిక లాంటిద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఎన్నారైలు ఎక్కువ‌మంది ఉన్నారు. ప‌లు రంగాల్లో మంచిస్థానాల్లో ఉన్నారు. అలాంటి వారికి క‌ష్టకాలం త‌ప్ప‌దేమోన‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాదు ట్రంప్ దెబ్బకు అప్పుడే స్టాక్ మార్కెట్ షేక్ అయ్యింది. ఐటీ, ఫార్మా రంగాలు న‌ష్టాల బాట ప‌ట్టాయి. ఇక ముందు వీసాలు కూడా క‌ష్ట‌మేన‌ని చెప్ప‌డం ద్వారా ఇండియ‌న్ స్టూడెంట్స్ కు మొండిచేయి చూపారు.

బ్లాక్ అయినా, వైట్ అయినా, బ్రౌన్ అయినా ఎలాంటి తారతమ్యం లేకుండా ఏ ఒక్క అమెరికన్ ఇకపై నిర్లక్ష్యానికి గురికారని ట్రంప్ హామీ ఇవ్వడం విశేషం. అయితే అమెరిక‌న్ల కోణంలో నుంచి చూస్తే.. వారి దృష్టిలో ట్రంప్ మంచి మార్కులు కొట్టేశారు. కానీ ఇండియ‌న్ల కోణంలో నుంచి చూస్తే… ట్రంప్ ప్ర‌సంగం భార‌తీయుల‌ను నిరాశ‌కు గురిచేసింద‌న్న మాట మాత్రం వాస్త‌వం. అయితే ఈ మాటలు ఎలా ఉన్నా… పాల‌న‌లో ఆయ‌న ఒబామాను మ‌రిపించ‌డం అంత ఈజీ కాదు. దానికి ముందు ట్రంప్ తాను మారాన‌ని నిరూపించుకోవాలి. అది అంత సులువుగా జ‌రిగే పని కాదంటున్నారు విమ‌ర్శ‌కులు!!!⁠⁠⁠⁠

 

Leave a Reply