ట్రంప్ నోటి కంపు..కూతుర్ని కూడా?

Posted October 10, 2016

  trump use nonsense words
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ నోటి కంపుని జనమే కాదు సొంత పార్టీ వాళ్లే భరించలేకపోతున్నారు.ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు వుండాయనగా అయన అభ్యర్థిత్వాన్ని మార్చడానికి కూడా కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి.ఇంతలా పరిస్థితి దిగజారడానికి రోజురోజుకి బయటపడుతున్న అయ్యగారి లీలలే.ఇంతకు ముందు మహిళల గురించి చౌకబారు విమర్శలు చేసిన ట్రంప్ వీడియోలు బయటపడితే…ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన ఓ రేడియో ఇంటర్వ్యూ ట్రంప్ ప్రతిష్టను అధఃపాతాళానికి తొక్కేసింది.17 ఏళ్ల కిందట హోవార్డ్ స్టెర్న్ అనే రేడియో జర్నలిస్ట్ కి ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో సొంత కుమార్తె అవయవ సౌష్టవం గురించి మాట్లాడేంత నీచానికి దిగజారాడు.ఆ ఇంటర్వ్యూ విన్న అమెరికన్లు ట్రంప్ ని అసహ్యించుకుంటున్నారు.

అధ్యక్ష బరిలో పోటీపడుతున్న ట్రంప్,హిల్లరీ ల మధ్య రెండో విడత బహిరంగ చర్చలోనూ ఇవే అంశాల్ని హిల్లరీ అస్త్రంగా వాడుకుని ట్రంప్ ని డిఫెన్స్ లోకి నెట్టారు. వాటికి క్షమాపణలు చెప్పిన ట్రంప్ ప్రైవేట్ సంభాషణల్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.క్లింటన్ రాసలీలని,అధికారిక సమాచారాన్ని వ్యక్తిగత మెయిల్స్ వాడడం మీద హిల్లరీ ని ఇరుకున పెట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారు.అయినా ట్రంప్ మీద వస్తున్న ఆరోపణలతో ఈ విషయాలు తేలిపోయాయి.

SHARE