Posted [relativedate]
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడాన్ని అక్కడి వారు చాలా మంది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే అతనిపై విమర్శలు చేస్తున్నారు. అసలు అతను ఎలా గెలిచాడన్న చర్చ ఇంకా నడుస్తూనే ఉంది. ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ట్రంప్ కుటుంబానికి ఈ నిరసనల సెగ తగిలింది.
ట్రంప్ కూతురు ఇవాంకా ఈ మధ్య తన భర్తతో కలిసి జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ విమానంలో శాన్ ఫ్రాన్సిస్కో కు వెళ్లింది. ఆ సమయంలో తోటి ప్రయాణికుడు ఒకరు ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఇవాంకా దగ్గరకు వెళ్లి ” ఓ మై గాడ్.. ఇది నిజంగానే నాకు పీడకల.. మీరు దేశాన్నే కాదు, విమానాలనూ వదిలిపెట్టడం లేదు..” అంటూ అతను వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ట్రంప్ కుటుంబాన్ని కించపరిచేలా నోటికొచ్చినట్టు అతగాడు ఏదేదో వాగాడట. అంతే ట్రంప్ కూతురు ఒక్కసారిగా షాక్ అయిపోయిందట. ఈ లోపు విమానంలో సిబ్బంది కలగజేసుకొని అతన్ని వారించారట.
సిబ్బంది ఎంత చెప్పినా వినిపించుకోలేదట. వెళ్లి సీట్లో కూర్చోవాలని సూచించినప్పటికీ డైలాగుల మీద డైలాగులు పేలుతూనే ఉన్నాడట. దీంతో ఈ వ్యవహారం మరింత దూరం పోకూడదే ఉద్దేశ్యంతో సిబ్బంది అతన్ని విమానం నుంచి దింపేశారని టాక్. అయితే మరో విమానంలో అతడికి అవకాశం ఇచ్చి మమ అనిపించారట.
అప్పటికప్పుడు ఈ వ్యవహారం సద్దుమణిగినా.. ట్రంప్ కుటుంబం మాత్రం ఈ ఇష్యూను చాలా సీరియస్ గా తీసుకుంటోందట. ట్రంప్ కూతురు ఆదేశాల వల్లే సిబ్బంది అతన్ని విమానం నుంచి దింపేశారని టాక్. మరి పోయి.. పోయి ట్రంప్ కూతురితో పెట్టుకుంటాడా.. ట్రంప్ కూతురా.. మజాకా..