రాజ్ నాధ్ గోపురాణంలో నిజమెంత?

Posted November 8, 2016

truth about rajnadh cow history

సోషల్ మీడియా వచ్చాక ఎన్నెన్నో వార్తలు,విశేషాలు చేతి సెల్ ఫోన్లో ప్రత్యక్షమైపోతున్నాయి. వాటిలో ఏది నిజం? ఏది కల్పన? ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం ఎవరినడగాలో తెలియని పరిస్థితి. ఉన్నంతలో ఎవరినీ అడక్కుండా గూగుల్ ని ఆశ్రయించే వాళ్ళే ఎక్కువ.అక్కడ కూడా సందేహం నివృత్తి కాకపోతే ఆ డౌట్ అలా మెదడుని తొలుస్తూనే ఉంటుంది.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న విషయాలు అంత తేలిగ్గా నమ్మేట్టు లేవు …అలాగనీ వదిలేసేంత చిన్న విషయాలు కాదు.పైగా హిందూ ధర్మం,భారతీయ పురాణాల ప్రాశస్త్యం గురించి వచ్చే సందేశాలు ఎక్కువ.భారత్ గొప్పదనాన్ని చాటేవి ఉంటున్నాయి.వీటిలో నిజానిజాలు తెలుసుకోడానికే ఎలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ గోవుల గురించి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు చెప్పారు.పైగా కొన్నిటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని కూడా అన్నారు.అంత పెద్దాయన తేలిగ్గా మాట్లాడతారా ?కాకుంటే అయన మాట్లాడింది గోరక్షక్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సదస్సులో ..ఇంతకీ అయన గోవుల గొప్పదనం గురించి ఏమి చెప్పారో మీరూ చూడండి..రాజ్ నాధ్ గోపురాణం హైలైట్స్ ఇవే ..

1.గోవులు,మానవుల్లో 80% జన్యువులు ఒకే రకంగా ఉంటాయి…రెండు జాతుల మధ్య పెద్ద తేడా ఉండదు .ఈ విషయాన్ని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం కూడా నిర్ధారించింది.
2.వేదకాలం నుంచి గోహత్య,బీఫ్ వాడకం మీద నిషేధం వుంది .
3 . అక్బర్,జహంగీర్ పాలనలోనూ గోవధపై నిషేధం వుంది.
ఈ మూడు ప్రకటనల్లో శాస్త్రీయ,చారిత్రిక సంబంధ అంశాలున్నాయి.వాటిలో నిష్ణాతులైన వారు కచ్చితమైన ఆధారాలతో ముందుకొస్తే బాగుంటుంది.

SHARE