టీటీడీ ఛైర్మ‌న్ గా రాయ‌పాటి?

0
482
ttd chairman rayapati sambasiva rao

Posted [relativedate]

ttd chairman rayapati sambasiva rao
టీటీడీ ఛైర్మ‌న్ చ‌ద‌ల‌వాడ‌కు మ‌రోసారి అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌చ్చన్న వార్త‌ల నేప‌థ్యంలో త‌ర్వాతి ఛైర్మ‌న్ ఎవ‌ర‌న్న దానిపై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. తిరుమ‌లేశుడి సేవ చేసుకునే ఆ భాగ్యం ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న దానిపై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. రేసులో చాలా మంది ఉన్నా… ఇద్ద‌రికి మాత్రం ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. అందులో ఒక‌రు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కాగా.. మ‌రొక‌రు ముర‌ళీమోహ‌న్.

రాయ‌పాటి సీనియ‌ర్ ఎంపీ. కాంగ్రెస్ పార్టీలో ప‌లు సార్లు ఎంపీగా ప‌నిచేశారు. అయినా కేంద్ర‌మంత్రి ప‌ద‌వి రాలేదు. అప్ప‌ట్లో టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఆయ‌న‌కు నోటిదాకా వ‌చ్చింది.. కానీ చివరి నిమిషంలో అది చేజారింది. ఇప్పుడు ఆయ‌న టీడీపీ ఎంపీగా ఉండ‌డంతో మ‌రోసారి ఆయ‌న పేరు ఛైర్మ‌న్ రేసులో వినిపిస్తోంది. అనుభ‌వంరీత్యా..అర్హ‌త దృష్ట్యా రాయ‌పాటి త‌గిన వ్య‌క్తి అని చంద్ర‌బాబు కూడా భావిస్తున్నార‌ట‌. ఈ విష‌యంలో ఇప్ప‌టికే బాబు-రాయ‌పాటి మ‌ధ్య చర్చ‌లు జ‌రిగాయ‌ని స‌మాచారం. చంద్ర‌బాబు నేనున్నానుగా అని భ‌రోసా ఇచ్చార‌ట‌.

ఇక ముర‌ళీ మోహ‌న్ పేరు కూడా ఛైర్మ‌న్ రేసులో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న పార్టీ వెన్నంటి ఉన్నారు. వైఎస్ నుంచి ఒత్తిడి వ‌చ్చిన‌ప్ప‌టికీ పార్టీ మార‌కుండా … నిల‌బ‌డ్డారు. గ‌తంలో ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన‌ప్ప‌టికీ ఈసారి ఎంపీగా గెలిచారు. అన్నీ అనుకూలిస్తే కేంద్ర‌మంత్రి ప‌ద‌వి కూడా అయ్యేవార‌ట‌. కానీ ఆ అవ‌కాశం లేని నేప‌థ్యంలో ఇప్పుడు టీటీడీ ఛైర్మ‌న్ అయినా ఇవ్వాల‌ని ముర‌ళీమోహ‌న్ .. చంద్ర‌బాబును కోరిన‌ట్టు స‌మాచారం. అందుకు బాబు ఎలాంటి హామీ ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ … ముర‌ళీమోహ‌న్ మాత్రం చాలా ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని టాక్.

రేసులో ఉన్న ఇద్ద‌రూ బ‌ల‌మైన వారే కావ‌డంతో… ప్రస్తుతానికి ఇంకెవ‌రూ లాబీయింగ్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌. బాబు కూడా ఇద్ద‌రి పేర్లు త‌ప్ప మిగ‌తా వారు విజ్ఞ‌ప్తి చేసినా… ప‌ట్టించుకునే అవ‌కాశం లేద‌ట‌. అందుకే ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రికి ఛాన్స్ క‌న్ ఫాం అని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ ఇద్ద‌రిలోనూ రాయ‌పాటి వైపే చంద్ర‌బాబు మొగ్గు చూపే అవ‌కాశ‌ముంద‌ని టీడీపీ వ‌ర్గాలు గుసగుస‌లాడుకుంటున్నాయి.

Leave a Reply