టీటీడీపీ ప్రెసిడెంట్ కూడా కారెక్కుతున్నారా?

0
578
ttdp president ramana to join trs party

Posted [relativedate]

ttdp president ramana to join trs party
టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్. రమణ పార్టీ మారుతున్నారా? టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ముహూర్తం కూడా ఖరారైపోయిందా? అంటే ఔననే గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీటీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న ఎల్.రమణ కొద్దికాలంగా పార్టీ నాయకుల తీరుపై అసంతృప్తితో ఉన్నారని టాక్. ఆయన ప్రెసిడెంట్ అయినా.. ఆయన చెప్పకుండానే పార్టీలో కొన్ని నిర్ణయాలు జరిగిపోతున్నాయట. ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ఇతర నాయకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరుతో ఆయన విసిగిపోయారట. రేవంత్ రెడ్డి తనకు కనీస మర్యాద కూడా ఇవ్వట్లేదని రమణ ఫీలవుతున్నారట. ఈ విషయంపై ఆయన చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే బాబుగారు కొంత ఓపిక పట్టాలని సూచించారని తెలుస్తోంది.

చంద్రబాబు పట్ల ఆయనకు ఎలాంటి అసంతృప్తి లేకపోయినా.. రేవంత్ రెడ్డి ఏకపక్ష వైఖరితోనే రమణ మనస్తాపం చెందారన్న వాదన ఉంది. అందుకు ఇక లాభం లేదనుకొని పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారట. ఇక ఇదే అదనుగా టీఆర్ఎస్ కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతోందని టాక్. ఇటీవల రమణను ఎర్రబెల్లి కలిసింది కూడా అందుకేనని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రమణ చేరికపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.

ఎర్రబెల్లి-రమణ మధ్య ఏం చర్చ జరిగిందో… రేవంత్ రెడ్డికి తెలుసట. అందుకే ఆయన ఎర్రబెల్లి.. టీడీపీలోకి వచ్చేస్తారంటూ కౌంటర్ ఎటాక్ చేశారట. ఈ ఊహాగానాల మాట ఎలా ఉన్నా రమణ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.

Leave a Reply