టీవీ 9 పజిల్ వైసీపీ విప్పుతుందా?

0
395
tv 9 support to paawan kalyan and chandrababu against ysrcp

Posted [relativedate]

tv 9 support to paawan kalyan and chandrababu against ysrcpటీవీ 9 ఇచ్చిన ఓ పజిల్ విప్పడానికి జగన్ నాయకత్వంలోని వైసీపీ ఆపసోపాలు పడుతోంది. ఇంతకీ ఆ పజిల్ ఏంటనేగా ?…..ఈనాడు,ఆంధ్రజ్యోతి గురించి మాత్రమే వై.ఎస్ కక్షగడితే ఆయన తనయుడు జగన్ మాత్రం ఆ జాబితాలోకి టీవీ 9 కూడా చేర్చేసారు.2014 ఎన్నికలకు చాలా ముందు నుంచే జగన్ తన ప్రసంగాల్లో ఆ రెండు పత్రికలు,టీవీ 9 ఛానల్ ని ఒకే గాటన కట్టేశారు.లోపల ఏమి జరిగిందో తెలియదు కానీ నిజానికి జగన్ మీద టీవీ 9 అప్పుడు ఇప్పుడు విపరీతమైన ప్రతికూల వార్తలు ఇచ్చింది లేదు.అయినా జగన్ ఆ ఛానల్ మీద అంతగా కక్ష గట్టడానికి కారణం తెలియదు. అందుకే టీవీ 9 మీద వైసీపీ,జగన్ అండ్ కో ఎప్పుడూ ఓ కన్నేసే ఉంటుంది.అలా కన్నేసినప్పుడే తెలిసిన రెండు పరస్పర భిన్న విషయాలు ఇప్పుడు వైసీపీ కి ఓ పజిల్ గా మారాయి.

ఆ విషయాలు ఇవే..ఇటీవల హైదరాబాద్ లో కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు బాగా బిజీ బిజీ గా గడిపారు.అంత హడావిడిలోనూ ఆయన టివీ 9 చీఫ్ రవి ప్రకాష్ తో రహస్యంగా భేటీ అయ్యారట.ఓ గంట పాటు ముఖాముఖీ చర్చలు జరిపినట్టు సాక్షి టీం జగన్ కి ఉప్పందించిందట.వాళ్లిద్దరూ ఏమి మాట్లాడుకున్నారు అనేది తెలియక ముందే ఇంకో సీక్రెట్ కూడా లీక్ అయ్యిందట.టివీ 9 ఎడిటోరియల్ సిబ్బందితో ఓ సమావేశం జరిపిన రవిప్రకాష్ ఇకపై ఛానల్ లో పవన్ నేతృత్వంలోని జనసేన అనుకూల వార్తలు పెంచమని ఆదేశాలు ఇచ్చారట.అటు ఆయన బాబుతో భేటీ కావడం,ఇటు సిబ్బందితో ఈ మాట చెప్పడానికి మధ్య టైం వారం రోజుల్లోపే. దీని వెనుక వున్న రహస్యం ఏంటి ? బాబే పవన్ కొమ్ము కాయిస్తున్నారా? అలా అయితే దాని నుంచి ఏమి ఆశిస్తున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ,జగన్ అండ్ కో కి పజిల్ గా మారింది. ఆ చిక్కుముడిని వైసీపీ కరెక్ట్ గా విప్పుతుందో లేదో చూద్దాం.

Leave a Reply