వినాయకుడి పెళ్లి ..టీవీ 9 అమ్మకం?

Posted September 28, 2016

  tv9 channel buying zee media
వినాయకుడి పెళ్లి ఎప్పుడంటే ..రేపు ..ఈ నానుడిని గుర్తు చేస్తోంది టీవీ 9 అమ్మకపు వ్యవహారం.టీవీ 9 అమ్ముతారని,దాన్నెవరో కొంటున్నారని వార్తలు రావడం కొత్త కాదు .కొన్నాళ్ళు ఈ వ్యవహారం ,కొత్త కొత్త పేర్లు ,ధరలు వినిపించడం ..ఆగిపోవడం షరా మామూలు అయిపోయింది.ఇప్పుడు టీవీ 9 గురించి మరోసారి బిజినెస్ పత్రికల్లో కథనాలొచ్చాయి.తాజా వార్త ఏమిటంటే tv9 మీద జీ గ్రూప్ కన్నేసిందని ..త్వరలో ఓ డీల్ కుదరొచ్చని .టీవీ9 లో ప్రధాన వాటాదారు శ్రీనిరాజు కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్టు ఇంగ్లీష్ పత్రికల కధనం.ఒక్కో పత్రిక ఒక్కో ధర చెప్పాయి.600 కోట్ల నుంచి 850 కోట్ల మధ్య డీల్ కుదరొచ్చని టాక్ .

తెలుగు,కన్నడ,గుజరాత్ లో కలిపి మొత్తం 7 చానెల్స్ టీవీ 9 ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.కర్ణాటక,గుజరాత్ ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని జీ గ్రూప్ భారీ డీల్ కి ఓకే అనుకుంటోందట.జీ కి rss అండ ఉందని మరో వార్త.ఇందులో నిజానిజాలేమిటో డీల్ పూర్తి అయితేగానీ చెప్పలేం .కొన్ని నెలల కిందట కెసిఆర్ సన్నిహితుడు ,మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు టీవీ 9 బేరం ఆడినట్టు ,కొన్నట్టు వార్తలు వచ్చాయి.అయితే అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఇప్పుడు మళ్లీ జీ గ్రూప్ వార్త.ఏదైమైనా ఓ ప్రాంతీయ ఛానల్ అప్పటి దిగ్గజాలతో పోలిస్తే తక్కువ ఆర్ధిక పెట్టుబడి,విస్తారమైన సరికొత్త ఆలోచనల పెట్టుబడితో ఇంత మార్కెట్ సృష్టించుకోవడం గొప్పే..

SHARE