ట్వీట్ లీడర్ గా మిగిలిపోతున్న పవన్?

0
560
tweet leader pawan kalyan

Posted [relativedate]

tweet leader pawan kalyan
జన సేనాని పవన్ కల్యాణ్ ఒకప్పుడు ట్వీట్ చేశారంటే ఎంతో ఆసక్తి ఉండేది. దానిపై జోరుగా చర్చ నడిచేది. కానీ రానురాను ఆయన ట్వీట్లలో చెప్పిందే చెబుతుండడంతో ఇప్పుడా ఇంట్రెస్ట్ పోయింది. కొత్తగా ఆయన ఏ ట్వీట్ చేసినా లైట్ తీసుకుంటున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఎంతసేపు కేంద్రాన్ని తిట్టడం… ఇక పోరాటమే అనడం తప్ప పవన్ ట్వీట్లలో కొత్త అంశం ఉండడం లేదు. కేంద్రానికి అల్టిమేటం విధించడం తప్ప ఆయన చేసేదేం లేదు. అప్పుడెప్పుడో ఇక సమరమేనంటూ హడావుడి చేసినా.. అది తాత్కాలికమేనని తేలిపోయింది. జనంలోకి వెళ్లాల్సిన టైంలో ఇక ట్వీట్ల ద్వారా కామెంట్లు చేయడంపై విమర్శలొస్తున్నాయి.
ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ టైంలో సభలు, సమావేశాల ద్వారా జనం మద్దతు కూడగట్టే అవకాశం పవన్ కు ఉంది. అయినా ఆయన మాత్రం ఆ పనిచేయడం లేదు. తాజాగా మరోసారి మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఆంధ్రులు ఈ దేశంలోనే ఉన్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎంతసేపు ట్వీట్లు పెట్టడం… ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం ఇదే తంతుగా మారింది. ఒక్కసారిగా ఈ ట్వీట్లను వదిలి సామాన్య జనంలోకి వస్తే బావుంటుందన్న వాదన వినిపిస్తోంది.
ఆమధ్య ఉద్దానం బాధితులకు అండగా నిలిచి ఆకట్టుకున్నారు పవన్ కల్యాణ్. కానీ ఆ తర్వాత మళ్లీ ట్వీట్లకే పరిమితమైపోయారు. ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్న ఆయన.. ఇకనైనా జనంలోకి వెళ్తే మంచిది.. లేకపోతే ఆయన ట్వీట్ల నాయకుడిగానే మిగిలిపోతారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

Leave a Reply