‘కాటమరాయుడుకి’ ఇద్దరు దర్శకులు?

Posted October 3, 2016

katamarayudu movie two directorsప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం ‘కాట‌మ‌రాయుడు’. డాలీ
దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది.
ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ కొనసాగుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ని
అక్టోబ‌ర్ 5 నుంచి త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రంలో ప్లాన్ చేశారు.

ఎస్ జె సూర్య దర్శకుడిగా ‘కాటమరాయుడు’ కొబ్బరి కొట్టుకున్నాడు. ఆ తర్వాత
ఈ చిత్రం నుంచి దర్శకుడు ఎస్ జె సూర్య డ్రాప్ కావడం ఆ స్థానంలో డాలీ
దర్శకత్వ బాధ్యతలని చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే స్క్రిప్ట్ లో డాలీ
తనదైన శైలిలో మార్పులు చేశాడని.. అవి పవన్ కి కూడా బాగా చెప్పుకొచ్చారు.
తాజాగా, ఈ చిత్రం గురించి మరో న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.
అదేటంటే.. ? ఈ చిత్రానికి మరో దర్శకుడు కూడా తోడయ్యాడట. స్ర్కిప్ట్
డెవ‌ల‌ప్‌మెంట్.. లొకేష‌న్ సెల‌క్ష‌న్ ఇలా అన్నింటిలోనూ ద‌ర్శ‌కుడు వాసు
వ‌ర్మ హెల్ప్ చేస్తున్నాడ‌ని చెప్పుకొంటున్నారు. ఇది తెలిసిన కొందరు..
‘కాటమరాయుడు’కి ఇద్దరు దర్శకులు అనే ట్యాగ్ లైన్ ని కూడా
ఇచ్చేస్తున్నారు.

ఇక, ‘కాటమరాయుడు’ రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇందులో
పవన్ ఫ్యాక్షనిస్ట్ లీడర్ గా కనిపించబోతున్నాడు. పవన్ తమ్ముళ్లుగా విజయ్
దేవరకొండ, కమల్ కామరాజు, అజయ్, శివబాలాజీ కనిపించబోతున్నారు. పవన్ సరసన
శృతి హాసన్ జతకట్టనుంది. చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. శరత్ మరార్
నిర్మాత.

SHARE