వెంకటేష్ 75 రేసులో శాతకర్ణి డైరక్టర్..?

0
382
Two Directors Race In Venkatesh 75th Movie

Posted [relativedate]

Two Directors Race In Venkatesh 75th Movieవిక్టరీ వెంకటేష్ నటిస్తున్న గురు సినిమా 73వది కాగా ఆ తర్వాత 74వ సినిమాగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు. ఇక 75వ సినిమా వెంకటేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయాలని చూస్తున్నాడు. ఇప్పటికే దానికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా భారీగా రాబోతున్న తరుణంలో వెంకీ 75వ సినిమాకు భారీ క్రేజ్ వచ్చేలా చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు డైరక్టర్ రేసులో క్రిష్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్య వందవ సినిమా శాతకర్ణి సినిమాను ఊహించని రేంజ్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న క్రిష్ చేతిలోనే తన 75వ సినిమా పెట్టాలని ఆలోచిస్తున్నాడట వెంకటేష్. ఇక ఆ రేసులో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఉన్నాడని తెలుస్తుంది. పూరితో వెంకీ సినిమా ఎన్నాళ్ల నుండో చర్చలు నడుస్తున్నాయి తప్ప సెట్స్ మీదకు వెళ్లింది లేదు. అయితే ఈసారి మాత్రం ఆ కాంబినేషన్ షురూ అవడం ఖాయమని అంటున్నారు. చిరు 150, బాలయ్య 100 ఎంత ప్రెస్టిజియస్ గా రాబోతున్నాయో వెంకటేష్ 75వ సినిమా కూడా అదే రేంజ్లో ఉండాలని చూస్తున్నారట మరి అది ఏ డైరక్టర్ చేతిలో ఎలాంటి సినిమా అవనుందో చూడాలి.

Leave a Reply