ఉదయ్ కిరణ్ …ఎందుకు అస్తమించావ్ ..?

0
1046

   uday kiran birthday special story

ఉదయ్ కిరణ్ .. ఈ రోజు నీ పుట్టిన రోజు.. పండగ చేసుకుందామంటే.. నీ ఘనవిజయాల చరిత్రను .. నీ జీవితపు చివరి పేజీ చెరిపేసిందయ్యా ..! అంతటి ఘన విజయం ఏంటంటారా.? రిలీజ్ రోజు పెద్ద సినిమా టిక్కెట్ దొరికితేనే పండగ చేసుకునే మధ్య తరగతిలో పుట్టావ్… కానీ ఏకంగా వెండి తెరపై వెలిగిపోవాలని కలకన్నావు.. నీ అమాయకపు మోము .. భావాలు పలికించే కళ్ళు.. ఆ కలను నిజం చేసాయి.. ఎవరి అండ దండలు లేకుండానే వెండితెరపై వెలిగిపోయావు..

ఆ వెలుగులు నీవి కావయ్యా.. మధ్య తరగతి యువతీ యువకుల ఆశలకు ఊపిరులు.. కీర్తితో పాటు ఆ వయసు కోరుకునే అన్నీ వచ్చాయి. అంతలోనే చేజారాయి.. అయితేనేం .. హృదయం బండరాయి కాదయ్యా.. మారడానికి ఏళ్ళు పూళ్ళు పట్టడానికి.. అది నెత్తురు ప్రవహించే సున్నిత భాగమే కదయ్యా.. ఆ సున్నితత్వానికి సరిపోయిన భాగస్వామిని వెదుక్కున్నావు.. జీవిత ప్రయాణాన్ని సాగించావు.. కానీ సినిమాలు వెంట సినిమాలు.. విజయాల వెంట విజయాలు.. రాలేదని కుంగిపోవటం ఏంటయ్యా..?

నిర్మలంగా ఉండే ఆకాశం మన జీవితమైతే మనల్ని ప్రకాశింపజేసే మెరుపులైనా, భయపెట్టే ఉరుములైనా .. వాటి జీవిత కాలం ఎంతయ్యా..? క్షణాలే కదా..! జీవితంలో కష్టాలు,సుఖాలు అంతే కదయ్యా .. అక్కడ క్షణాలైతే ఇక్కడ రోజులు.. నెలలు.. సంవత్సరాలు .. అయితే ఏం..? బతికితే కదా రేపు ఏమి అవుతుందో తెలిసేది… సూర్యుడు ఉదయించడం.. అస్తమించడం.. రెండూ సహజమే.. ఆ సహజత్వం లేకుండానే ఎందుకు అస్తమించావయ్యా.?
ఉదయ్ కిరణ్.. ఎందుకు అస్తమించావ్..?

* కిరణ్ కుమార్

Leave a Reply