ఉదయభాను కవలల తల్లి అయిందోచ్..

0
571
udaya bhanu to give birth to twin babbies

Posted [relativedate]

udaya bhanu to give birth to twin babbies
ప్రముఖ యాంకర్ ఉదయభాను కొన్నాళ్లుగా బుల్లి తెరకి దూరంగా వుంటున్నారు.కానీ కారణం ఏమిటో బయటకు రాలేదు.ప్రేమ అనే మహిళా జర్నలిస్ట్ పుణ్యమాని ఆ గుట్టు వీడింది.ఇన్నాళ్లు ఉదయభాను తెరపైకి రాకపోవడానికి కారణం ఆమె తల్లి కావడమే. ఉదయభానుకు కవలలు పుట్టారు. ఇద్దరూ ఆడపిల్లలే .ఒకరి పేరు యువీ నక్షత్ర ,ఇంకోరి పేరు భూమి ఆరాధ్య.దీంతో ఒకేసారి ఇద్దరు లక్ష్మీదేవులు తన ఇంట అడుగు పెట్టారని భాను సంతోషపడిపోతోంది.

ఉదయభాను పదేళ్ల కిందట ఇంట్లోవాళ్ళని ఎదిరించి మరీ విజయ్ కుమార్ అనే వ్యాపారవేత్తని పెళ్లాడింది.అప్పట్లో ఆమె,ఆమె తల్లి మధ్య మీడియా సాక్షిగా విబేధాలు బయటికి వచ్చాయి.అయితే కొన్నాళ్ళకి అంతా సద్దుమణిగింది.రెండు వైపులా రాజీపడి హాయిగా కాలం గడిపేస్తున్నారు.పెళ్ళైన పదేళ్లకు ఇలా కవలలు ఇంట అడుగుపెట్టడంతో భాను దంపతులు ఫుల్ ఖుష్.అయితే ఈ విషయాన్ని వాళ్ళు మీడియాకి కూడా వెల్లడించలేదు.అయితే ఇటీవల ప్రేమ అనే జర్నలిస్ట్ ఉదయభాను ని కలిసిన సందర్భంగా ఆ చిన్నారులతో ఫోటో దిగి తన ఫేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేయడంతో విషయం బయటికి వచ్చింది.ఓ సంతోషకరమైన వార్తని భాను ఎందుకు బయటపెట్టలేదో..ఏమిటో !

Leave a Reply