సినిమా కాదు వల.. సినిమాకే వల..

   udta punjab movie release direct online piracyఇంటర్ నెట్…దీంట్లోని నెట్ కు చిత్ర పరిశ్రమ అల్లలాడి పోతోంది.రిలీజ్ కి ముందే నెట్ లో చిత్రాలు ప్రత్యక్షం కావడం.ఈ మధ్య చాలా సులభంగా జరిగిపోతోంది .పైరసీ మహమ్మారి నుంచి తట్టుకునేందుకే ఇండస్ట్రీ నానా తంటాలు పడి విసిగి పోయింది.చేసేది ఏం లేదనుకున్నారో మరి చెప్పి చెప్పి అలసిపోయారో గాని ఈ మధ్య ఆ పైరసీ మాటలు తగ్గాయి.దానికే నిర్మాత చాలా అన్యాయమైపోతాడు.ఇలాగైతే పరిశ్రమ నడవడం కష్టం అనే భయం కనిపించింది.మరి ఇలా డైరెక్ట్ గా నెట్ లోనే సినిమా రిలీజ్ అయితే పరిశ్రమ పరిస్థితేంటీ ? ప్రచారం కోసం ఇంటర్ నెట్,సోషల్ మీడియా ని సినిమా వాళ్ళు బాగానే వాడేస్తుంటారు.అది చిన్న సినిమా అయినా,పెద్ద సినిమా అయినా వాడకం వకేలా ఉంటుంది.

ట్రైలర్ అని టీజర్ లని రిలీజ్ లకు వలను వేదిక చేసుకోవడం అలవాటు.అలాంటప్పుడు ఇది కూడా ప్రచారం కోసం వాళ్లే చేస్తున్నారా.లేక ఎవరో మోసగిస్తున్నారా ? తెలియడం లేదు.అత్తారింటికి దారేది లో ఒక పార్ట్ నెట్ లో రిలీజ్ కు ముందు లీక్ అయితే ఆ సినిమా టీమ్ బెంబేలెత్తిపోయింది.ఆ తర్వాత ఉడ్తా పంజాబ్ సెన్సార్ కోర్టు కేసులతో అంత ప్రచారం పొందిన తర్వాత నెట్ లో ప్రత్యక్షం అవడం గమనార్హం..ఇప్పుడు తాజాగా తమిళంలో మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్ హీరో గా నటించిన” ఇనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు ”రిలీజ్ కి ఒకరోజు ముందే మొత్తం సినిమా ఇంటర్ నెట్ లో ప్రత్యక్షమైంది.అటు బాలీవుడ్,టాలీవుడ్,కోలీ వుడ్ అన్ని పరిశ్రమలకు ఈ సెగ తగిలింది.ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో ?

Leave a Reply