గులాబీనేతల కోసం ఉమా బలి?

 uma madhava reddy kill because  kcr politician

నయీమ్ కేసుకి సంబంధించి వస్తున్న లీకులపై దేశం నేత ఉమామాధవ రెడ్డి గొంతెత్తారు.ఆ లీకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలిసే బయటకి వస్తున్నాయని ఆమె ఆరోపించారు.ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన ప్రభుత్వం ఈ పనికి దిగిందని ఉమా ఆవేదన చెందారు .మాధవ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన తనకు కుట్రలు,కుతంత్రాలు,నేరాలు తెలియవని చెప్పారు .నక్సల్స్ వల్ల మాధవరెడ్డిని కోల్పోయిన తమను మరోసారి ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

తన ఫోన్ సంభాషణలపై ఎలాంటి విచారణ జరుపుకున్నా అభ్యంతరం లేదని ఉమా స్పష్టం చేశారు .మాధవరెడ్డి చనిపోయిన దగ్గరనుంచి ఒకే ఫోన్ నెంబర్ వినియోగిస్తున్నట్టు ఉమా వివరించారు .తప్పు చేస్తే జైల్లో కూర్చోడానికైనా సిద్ధమని ఆమె ప్రకటించారు .తమ  కుటుంబ  చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని ఉమా అన్నారు.అసలు దోషులు బయటకి రావాలంటే న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మరో వైపు ఇదే డిమాండ్ చేసిన ఆమె కుమారుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి ఇంకో బాంబు పేల్చారు .నయీమ్ తో దగ్గర సంబంధాలున్న టీఆరెస్ నేతల్ని కాపాడేందుకే తమ కుటుంబంపై బురద చల్లుతున్నారని అన్నారు.

SHARE