2013..సెప్టెంబర్ 19 ..కాంగ్రెస్ వార్ రూమ్ ..ఏపీ విభజనకి ఆంధ్రా ప్రాంత నాయకుల్ని ఒప్పించేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సమావేశమైన రోజు ..ఆరోజు ఉండవల్లి ఆయన్ను ముప్పుతిప్పలు పెట్టారట ..అదేలేండి ..మాటల్లో..హైకమాండ్ విభజనకి డిసైడ్ అయ్యామని చెప్పేసింది.అయితే మాకేమిస్తారని అడగాల్సిన ఉండవల్లి గారు అది వదిలేసి విభజన ప్రక్రియ ఎలా ఉంటుందని అడిగారు.మధ్యప్రదేశ్ తరహాలో చేస్తామని చెప్తే ఇక సమస్యే లేదని ఉండవల్లి అన్నారు.దాంట్లో నిగూడార్థం ఏంటంటే..అక్కడ అసెంబ్లీ తీర్మానం తరువాతే విభజన ప్రక్రియ మొదలైంది.ఉండవల్లి మాటల అర్ధం తెలిసిన డిగ్గీ మండిపడ్డారంట.నువ్వు తెలివైన బ్రాహ్మణుడివి..నేను మూర్ఖపు ఠాకూర్ ని..మాటల్లో నీతో గెలవలేను..కానీ ఇదే ధోరణిలో ముందుకెళితే మీ ప్రాంతానికి తీరని నష్టం చేసిన వాళ్లవుతారు..దిగ్విజయ్ ఇలా ఉండవల్లికి బదులిచ్చారట.
నిజంగా ఆ రోజు మధ్యప్రదేశ్ ప్రస్తావన వల్ల ఉండవల్లి తెలివితేటలు బయటపడ్డాయి తప్ప ..రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా ? విభజన ఆగిందా?ఇన్నాళ్లు కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రా నాయకులకి విషయం చెప్పలేదనుకున్నాం ..కానీ వాళ్ళు చెప్పింది వినిపించుకోకుండా తమని అతిగా ఊహించుకుని కొండని ఢీకొట్టారు.సొంత పైత్యం కోసం ఆంధ్రుల భవిష్యత్ ని తాకట్టు పెట్టారు.ఆ రోజు నిజంగా డిగ్గీ మాట విని ఉంటే రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి అడిగే అవకాశం …వాళ్ళు కూడా దాన్ని సానుకూలంగా తీసుకునే పరిస్థితి కనిపించేది.పార్లమెంట్ లో విభజన ప్రక్రియ ఆంధ్రుల మనోభావాలు ఇంతగా దెబ్బతినకుండా కాస్త మర్యాదగా జరిగివుండేది.