ఉండవల్లి..జగన్ దోబూచులాట..

  undavalli arun kumar reddy and jagan mohan reddy play political game
మేళతాళాలతో ఇంటికెళ్లి శుభలేఖ ఇచ్చి పెళ్ళికి పిలిస్తే రాకుండా …వెనుక తలుపు తట్టి కాస్త చారుంటే పోయామన్నారట వెనకటికి ఎవరో…వైసీపీ విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యవహారం కూడా అలాగే వుంది.జగన్ ఇంటికొచ్చి మరీ పలకరించినప్పుడు బెట్టుపోయిన అయన ఇప్పుడు వైసీపీ లో ఎప్పుడెప్పుడు చేరదామా అని తహతహలాడుతున్నారు. పైకి మాత్రం అలాంటి ఆలోచన లేదని చెబుతూనే జగన్ కంట్లో పడ్డానికి బాబు మీదకి యుద్ధానికి సైసై అంటున్నారు. అయినా పిలుపు రాలేదని కాబోలు కొత్త పల్లవి అందుకున్నారు.

Ys రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ని అధికారంలోకి తేవడంలో విఫలమయ్యారని చెప్పిన ఉండవల్లి…మంచి సలహాదారులు దొరగ్గానే 1999-2004 మధ్య ప్రతిపక్ష నేతగా రాణించారని వెల్లడించారు.ఇప్పుడు జగన్ చుట్టూ కూడా అలాంటి టీం ఉంటే బాగుంటుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఓ విధంగా తన లాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే మంచిదని పరోక్షంగా జగన్ కి సంకేతాలిచ్చారు.మరో వైపు వ్యూహకర్తలు కావాలంటున్న జగన్ కి ఈ మాటలెందుకు వినిపించడం లేదో అర్ధం కావడం లేదు..ఇద్దరి ఉద్దేశం బాబుని గద్దె దించడమే అయినపుడు ఈ దోబూచులాట ఏమిటో అని వైసీపీ శ్రేణులు గొణుక్కుంటున్నాయి.

SHARE