వుండవల్లీ ముసుగు తియ్యరాదూ..

Posted [relativedate]

  undavalli arun kumar reddy wrote letter arun jaitley
యుద్ధ నీతి ఒకటుంటుంది.శత్రు వీరులకి సరిజోడి అయిన వారే రణరంగంలో వారితో తలపడేలా చూడటమే ఒకప్పటి యుద్ధ నీతి.అయితే కాలంతో పాటు యుద్ధ నియమాలు,వ్యూహాలు మారిపోయాయి.విజయమే పరమావధిగా ఎవరైనా ఏమైనా చేయొచ్చని నమ్మి అనుసరించే కాలమిది.చివరికి యుద్ధభూమిలో వాళ్లే కాకుండా చూసే వాళ్ళు కూడా ఆయుధ ప్రయోగం చేస్తున్న రోజులివి.అందుకు ప్రబల సాక్ష్యమే …ఉండవల్లి అరుణ్ కుమార్ .

రాష్ట్ర విభజన యుద్ధంలో ఓడిపోయి అస్త్ర సన్యాసం చేసిన అయన కొన్నాళ్లుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు.ఏ పార్టీలో చేరకుండా ఆంధ్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే అయన పోరాడుతారు.పాపం ఎంత గొప్ప నేతో..ఆ పోరాటం కూడా ఒక్క చంద్రబాబు మీద మాత్రమే చేస్తారు.ఇప్పుడు నల్లధనం గురించి చంద్రబాబు మాట్లాడగానే ఉండవల్లి స్పందించారు.ఆ వివరాలు బాబుకేల తెలిశాయని కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీకి లేఖ రాశారు.జగన్..ప్రధాని మోడీకి ,ఉండవల్లి…జైట్లీకి రాసిన లేఖల్లో టార్గెట్ ఒకరే చంద్రబాబు.ఇప్పుడే కాదు ఉండవల్లి మళ్లీ గళమెత్తడం మొదలెట్టాక బాబు టార్గెట్,జగన్ కి సపోర్ట్ గా ప్రతి మాట,ప్రతి చేత సాగుతున్నాయి.

అదేమిటంటే నా ఇష్టం అని అయన అనొచ్చు..నిజమే వై.ఎస్ గొడుగు కింద కాంగ్రెస్ కళ్ల నుంచి చూసినప్పుడు ఈ దేశంలో మీకు ఒక్క రామోజీ నియమోల్లంఘన మాత్రమే కనిపించింది.అప్పుడు మీరు ఓ పార్టీ ప్రతినిధి..కానీ ఇప్పుడు ప్రజల పక్షాన అంటూ ఓ పార్టీ కి మేలు చేయడానికి మరొకరికి నష్టం తలపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.దానికి ప్రజా సంక్షేమం ముసుగు తీసి మేలు చేస్తున్న పార్టీ కండువా కప్పుకుంటే మంచిది.ఆలా కాక ఇలా రాజకీయం చేస్తే స్టేడియం లో కూర్చున్న ప్రేక్షకుడు బంతి పట్టి అవుట్ అన్నట్టు ఉంటుంది..దానికన్నా ముసుగు తీయడం మేలు ఉండవల్లి గారూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here