అమరావతి లో 100..150 ఏళ్ళకి రేట్లు పెరుగుతాయా?

0
631

 undavalli arun kumar said about chandrababu amaravathiఅమరావతిలో భూముల ధరలు పెరుగుతాయని ఆశపడుతున్న రైతులు,వ్యాపారుల కి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ పెద్ద షాక్ ఇచ్చారు.అక్కడ ధరలు పెరుగుతాయి అంటూనే..అప్పటికి మనం ఈవారం బతికుండమని తేల్చేశారు.అంతటితో ఆగకుండా చంద్రబాబు చెప్పినట్టు గజం పదివేలు కావాలంటే 100…150 ఏళ్ళు పడుతుందని వ్యంగ్యంగా చెప్పేశారు. రాజధాని నిర్మాణం కోసం తలపెట్టిన స్విస్ ఛాలెంజ్ విధానంలోని లోటుపాట్లను వివరిస్తూ అయన ఓ బుక్లెట్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు విధానాలపై ఉండవల్లి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అమరావతి ఓ భ్రమరావతి అని అయన వ్యాఖ్యానించారు.బ్రెజిల్ లో జరిగిన కుంభకోణంలో సంబంధమున్న సంస్థలకి రాజధాని నిర్మాణాన్ని అప్పగిస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు.పదేపదే సింగపూర్ గురించి బాబు గొప్పలు చెప్తున్నా ..ఆ దేశం ఇప్పుడు ధనవంతుల నల్లడబ్బు దాచుకునే కేంద్రంగా మారిపోయిందని ఉండవల్లి అన్నారు.అయితే 50 ఏళ్లుగా అక్కడ ఒక్క పార్టీనే పాలిస్తోందని..బాబు ఇక్కడా అలాగే జరగాలనే ఉద్దేశంతోటే సింగపూర్ పాట పాడుతున్నారని ధ్వజమెత్తారు.

బాబుని ఉండవల్లి టార్గెట్ చేయడం ఎలా వున్నా..అమరావతిమీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు మాత్రం ఆందోళన పడుతున్నారు.ఉండవల్లి వ్యాఖ్యల్లో నిజానిజాల గురించి తెలిసిన వాళ్ళని వాకబు చేయడం మొదలెట్టారు.

Leave a Reply