బ్రహ్మం గారిని మించిన కాలజ్ఞాని ఉండవల్లి ..

 Posted [relativedate]

undavalli arun kumar said about tdp party leaders
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే పడని వాళ్ళు ఉంటారేమో గానీ..అయన వాగ్ధాటిని,విషయ పరిజ్ఞానాన్ని లెక్క చేయనోళ్లు వుండరు.అలాంటి నేత కొన్నాళ్లుగా చంద్రబాబు సర్కార్ మీద ప్రతి అంశం మీద పోరాటం చేస్తూనే వున్నారు.వైసీపీ అనుకూల ముద్ర పడుతోందని భావించి ఇటీవల పనిలోపనిగా జగన్ ని కూడా చేతకాని ప్రతిపక్షనేతగా ఓ మాట అనేసారు.అయన అంత తేలిగ్గా మాట్లాడరు అని భావిస్తున్న తరుణంలోనే మళ్లీ ఓ సంచలన ప్రకటన చేశారు.

2018 బడ్జెట్ సమావేశాల తర్వాత టీడీపీ నుంచి వికెట్లు రాలతాయని ఉండవల్లి అంచనా వేశారు.ఇక అప్పటినుంచి ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తాయని ఉండవల్లి అంటున్నారు.అయితే వాటిని ఊహించడం కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మం గారి వల్ల కూడా కాదంటున్నారు ఉండవల్లి.అంటే అంతకన్నా ఎక్కువ జ్ఞానం ఉండి..టీడీపీ ఖాళీ అవుతుందని చెప్తున్నారా ఉండవల్లి గారూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here