ఉండవల్లి నోట అదే మాట..

  undavalli arun kumar said not coming again politics
ఉండవల్లి అరుణ్ కుమార్ …వరస ప్రెస్ మీట్ లతో చంద్రబాబు సర్కార్ మీద మాటల దాడి ఉధృతం చేశారు.అయన రేపోమాపో వైసీపీ లో చేరడం ఖాయం అనుకున్నారంతా.అయితే మళ్లీ రాజకీయ పార్టీల్లో చేరే ఆలోచన లేదని ఉండవల్లి మరోసారి ప్రకటించారు.కానీ బాబు మీద ఫైర్ అయిపోతూ 5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారని గుర్తు చేశారు.ఈ మాటలు వైసీపీ అధ్యక్షుడు జగన్ వని అందరికీ గుర్తుంది.అదే మాటలు నొక్కివక్కాణిస్తూ …వైసీపీ కి మేలు చేసే పనులు.. ప్రకటనలతో ఉండవల్లి ఉదరగొట్టడం మీద ఎవరికీ అభ్యంతరం లేదు .ఎవరి రాజకీయ అభిప్రాయాలు వారివి …కానీ రాజకీయాల్లో మునిగితేలుతూ ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని చెప్పి ఎవరి కళ్ళు మూయదల్చుకున్నారు? దీని వల్ల ఏమి ఆశిస్తున్నారు ? జనం మరీ అంత పిచ్చివాళ్ళు కాదని ఉండవల్లి లాంటి మేధావులకు ఎప్పుడు అర్ధమవుతుందో?

SHARE