బాబు గురువులన్నా,శిష్యులన్నా ఉండవల్లికి పడదా?

undavalli arun kumar shout tdp minister narayana
ఉండవల్లి అరుణ్ కుమార్ …తన వాక్చాతుర్యం తో ఎంతట వారినైనా మెప్పించగల దిట్ట.అయన వాదన పటిమ,పోరాటం చేసే తీరు ప్రత్యేకం ….అయితే ఆయన ఎప్పటినుంచి రాజకీయాలు చేస్తున్నా మార్గదర్శి మీద పోరాటం తోనే ఉండవల్లికి గుర్తింపు వచ్చింది.అందులో గెలుపు ఓటములు ఎలా వున్నా వైస్ అండతో రామోజీని బాగా ఇబ్బంది పెట్టగలిగారు.ఇప్పుడు మళ్లీ వైసీపీ లో చేరడానికి సిద్ధమవుతున్న తరుణంలో అయన బాబు సర్కార్ మీద దాడి ఉద్ధృతం చేశారు.అందులో భాగంగా మంత్రి నారాయణ ని టార్గెట్ చేశారు.

477.70 కోట్ల ఆస్తి ఉందని ప్రకటించిన నారాయణ ఈ మొత్తం ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఉండవల్లి.ఓ విద్యాసంస్థకి సంబంధించిన సొసైటీ నడుపుతున్న అయన …దాని ద్వారా ఇంత మొత్తం సంపాదించడం నేరమని ఉండవల్లి వాదిస్తున్నారు .ఈ ఆస్తులు లెక్క నారాయణ చెప్పకపోతే నేనే చెప్పిస్తా అంటూ ఉండవల్లి ఘాటు హెచ్చరికలు చేశారు.

ఇదంతా గమనిస్తే ఓ విషయం అర్ధమవుతుంది.ఉండవల్లి రాజకీయ యుద్ధం చేసేది చంద్రబాబు మీద..కానీ అయన టార్గెట్ బాబు సన్నిహితులు అవుతున్నారు .ఇంతకముందు బాబుకి గురువుగా చెప్పుకునే రామోజీరావు ,ఇప్పుడు బాబుకి అనుంగు శిష్యుడిగా చెప్పుకునే నారాయణ…అంటే బాబు మీద ఉండవల్లి కోపానికి అయన గురుశిష్యులు బలవుతున్నారు.కానీ బాబుతోపాటు దేశవ్యాప్తంగా విస్తృత పరిచయాలున్న రామోజీ మార్గదర్శి కష్టం నుంచి బయటపడ్డారు.ఇప్పుడు బాబు తప్ప మరో ఆసరా లేని నారాయణ ఈ సమస్యను ఎలా డీల్ చేస్తారో ?

SHARE