జగన్ పై ఉండవల్లి దాడి గుట్టు ఇదే ..

 Posted October 18, 2016

  undavalli attack on jagan reason
ఉండవల్లి ఉన్నట్టుండి జగన్ పై దాడి చేయడం కాకతాళీయమేనా?లేక దీని వెనుక ఏదైనా వ్యూహముందా? జగన్ కి అనుకూలంగా మాట్లాడుతూ … మాట్లాడుతూ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడం ..ఉండవల్లి లాంటి మేధావి తేలిగ్గా చేసేస్తారా?ఎట్టిపరిస్థితుల్లో ఆలా చేయరు.కానీ ఆలా చేయడం వెనుక కచ్చితమైన వ్యూహం ఉందనే అనిపిస్తోంది.వై.ఎస్ అనుచరుడిగా చెప్పుకునే ఉండవల్లి ఇప్పుడు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న కేవీపీ కి అంతకన్నా దగ్గర మనిషి అన్న విషయం అందరికీ తెలిసిందే.ఆ కేవీపీ మీద కాంగ్రెస్ హైకమాండ్ ఓ బాధ్యత పెట్టిందట.అది జగన్ ని కాంగ్రెస్ కి దగ్గర చేయడం.హోదా అంశంపై కేవీపీ ప్రైవేట్ బిల్లు,జగన్ పోరాటం తదితర పరిణామాలన్నీ ఆ దిశగానే సాగాయి.జగన్ కూడా హోదా పోరాటం చేయడానికి రెడీ అయిపోయారు.యువభేరి లాంటివి నిర్వహించి హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు.పక్క రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ముఖ్య నాయకుడు కేసుల అంశాన్ని ప్రస్తావించి జగన్ ని సైలెంట్ చేశారట.

హోదా ఉద్యమం ఊపందుకుంటే అదే హామీ తో ఆంధ్రాలో మళ్లీ బలం పుంజుకోవచ్చని,జగన్ అండతో అధికారానికి దగ్గర కావచ్చని కాంగ్రెస్ భావించింది.జగన్ కూడా ఓ జాతీయ పార్టీ అవసరం గుర్తించారు.అయితే అది కాంగ్రెస్ కన్నా బీజేపీ అయితే బాగుంటుందని అయన అభిప్రాయం.ఇప్పటికిప్పుడు ఆ అవకాశాలు లేకపోయినా కాంగ్రెస్ తో అంటకాగితే భవిష్యత్ లో కూడా బీజేపీ తలుపులు తెరుచుకోవని జగన్ డౌట్ .అన్నిటికన్నా ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకోవడంలేదు.మోడీకి ప్రత్యామ్న్యాయం కనపడ్డం లేదు .దీంతో పాటు విభజన పాపం కాంగ్రెస్ దేనని ఆంధ్రా ప్రజలు నమ్ముతున్నారు.ఈ విషయమే జగన్ ని కాంగ్రెస్ వైపు మళ్లనీయడం లేదు.అందుకే బాబుని టార్గెట్ చేస్తూ ,బీజేపీ ని ఏమీ అనకుండా నెట్టుకొస్తున్నారు.సహజంగానే ఈ పరిణామాలు కాంగ్రెస్ కి మంటెక్కించాయి.అందుకే 10 జన్ పద్ కేవీపీ ని ,అయన వుండవల్లిని అలెర్ట్ చేశారని తెలుస్తోంది.అందుకే జగన్ కేంద్రం తో పోరాడడం లేదని ఉండవల్లి అనగలిగారు.జగన్ పై ఒత్తిడి పెంచి అయన కేంద్రంపై పోరాడేలా చేయడం లేదా ఆయన్ను దోషిగా నిలబెట్టి ముందుకెళ్లడం అనే ద్విముఖ వ్యూహాన్ని కాంగ్రెస్ ట్రై చేస్తోంది.ఏమైనా బీజేపీ కి దగ్గర కాలేక కాంగ్రెస్ కి దగ్గర అవ్వలేక జగన్ నలిగిపోతున్నారు.ఈ సరికొత్త ఛాలెంజ్ ని అయన ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

SHARE