ఉండవల్లి ఇగో హర్ట్..జగన్ కి షాక్

 Posted October 17, 2016

undavalli ego hurt on jagan
ఉండవల్లి ఇగో హర్ట్ అయింది.జగన్ కి షాక్ తగిలింది.దాదాపు రెండేళ్ల పాటు రాజకీయ సుప్తావస్థ లో ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్ని నెలలుగా యాక్టివ్ అయ్యారు.అప్పటి నుంచి చంద్రబాబుని టార్గెట్ చేసి..జగన్ తప్పుల్ని తక్కువగా చూపే ప్రయత్నం చేశారు.కొన్నాళ్ళకి ఇంకాస్త ముందుకెళ్లి రాజశేఖర రెడ్డి చుట్టూ ఉన్నట్టు జగన్ దగ్గర వ్యూహకర్తలు లేరని చెప్పారు.ఓ విధంగా చెప్పాలంటే నా లాంటి వాడి అవసరం ఉందని జగన్ కి చెప్పకనే చెప్పారు.అయినా వైసీపీ నుంచి గౌరవప్రదమైన ఆహ్వానం రాలేదో ఏమో ..ఉండవల్లి గారి ఇగో హర్ట్ అయింది.తాజా ప్రెస్ మీట్ లో అది స్పష్టమైంది.

విభజన చట్టం అమలు విషయంలో టీడీపీ,బీజేపీ కుట్రతో వ్యవహరిస్తుంటే వైసీపీ కూడా అందులో భాగస్వామి అవుతోందని ఉండవల్లి సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా వైసీపీ ప్రశ్నించకపోవడంతో ఆ సందేహం వస్తోందన్నారు.బ్లాక్ మనీ విషయంలో కూడా అధికార ప్రతిపక్షాలది పొలిటికల్ గేమ్ అని అయన ఆరోపించారు.ఆయన ఆరోపణలు టీడీపీ కి అలవాటే.వైసీపీ ఈ ఊహించని దాడితో షాక్ అయింది.కేసుల వల్లే ప్రతిపక్ష పాత్ర పోషణలో జగన్ ఉదాసీనంగా వుంటున్నారన్న విమర్శలకి ఉండవల్లి వ్యాఖ్యలతో మళ్లీ ఊపొచ్చింది.దీనికి జగన్ అండ్ కో ఏమి సమాధానం ఇస్తారో?

SHARE