Posted [relativedate]
రాజకీయ మౌనం వీడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్నాళ్లుగా చంద్రబాబు సర్కార్ మీద వరుస అస్త్రాలు ప్రయోగిస్తూనే వున్నారు.ఆ బాణాలు బాబు బద్ధ శత్రువు జగన్ మెడలో పూలమాల అవుతుందని వైసీపీ వర్గాలు భావించాయి.సాక్షిలో ఆయనకి పెద్దపీట కూడా లభించింది.పరిస్థితులు పెద్దగా మారలేదుగానీ ఉండవల్లి స్వరం మారింది.చంద్రబాబుని తిడుతూనే జగన్ అసమర్థుడని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు.గత రెండు మూడు ప్రెస్ మీట్ లలో ఉండవల్లి మాటల్ని చూసిన వాళ్లకి ఈ విషయం తేలిగ్గా అర్ధమవుతోంది.
అంతకన్నా ముఖ్యంగా 2018 అసెంబ్లీ బడ్జెట్ సెషన్ తర్వాత టీడీపీ లో వికెట్లు పడతాయని చెప్పిన ఉండవల్లి..జగన్ ని టార్గెట్ చేయడం ఆపలేదు.మరో అడుగు ముందుకేసి ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతాయని ఉండవల్లి చెప్పడం చూసాక వైసీపీ లో కంగారు మొదలైంది.ఏపీ లో అధికార, ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా సరికొత్త రాజకీయ సమీకరణాలు జరగబోతున్నట్టు ఉండవల్లికి కచ్చితంగా తెలుసని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.జగన్ ని బలవంతంగా కాంగ్రెస్ వైపు మళ్లించే కుట్ర ఉందని కూడా మరో వర్గం భావిస్తోంది.మొత్తానికి ఉండవల్లి ఏదో చేస్తున్నారన్న అనుమానం వైసీపీ కే కాదు ..టీడీపీ కి కూడా వుంది.ఉండవల్లి గుప్పిట వున్న ఆ రహస్యాన్ని విప్పేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి.చూద్దాం అవెంతవరకు ఫలిస్తాయో?