పత్రికా కధనాలు సాక్ష్యాలా…ఉండవల్లీ ఏంటిది?

Posted November 15, 2016

Undavalli Fires On PM Modi Over Ban Of 500 and 1000 Notes500 ,1000 నోట్ల రద్దు తర్వాత ప్రధాని మోడీ మీద విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.వారితో గొంతు కలిపారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ . విషయ పరిజ్ఞానం వున్నాయన ఏమి చెప్తాడో అని అంతా ఆసక్తిగా విన్నారు.మోడీ నిర్ణయం ప్రభావం రోజులు,నెలలు కాదని అంతకంటే ఎక్కువకాలమే ఉంటుందని అయన చెప్పిన మాటలు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.అయితే మోడీ నిర్ణయం ఇంతకుముందే చాలా మందికి తెలుసని ఉండవల్లి ఆరోపించారు.అందుకు సాక్ష్యం అంటూ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల్ని ప్రదర్శించారు.వార్తా కధనాలు ఎలా రాస్తారో అవగాహన ఉన్న అరుణ్ కుమార్ గతంలో జర్నలిస్ట్ గా కూడా పని చేశారు.అలాంటి అయన నోట వార్తాకథనాలు సాక్ష్యాలు అని వినిపించడం చోద్యం …ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపితం అని చెప్పక తప్పదు …సారీ ఉండవల్లి ..

SHARE