ఉండవల్లి తో తలపడేది ఇతనా?

0
513

undavalli sabbam hari
ఎవరు ..ఎప్పుడు ..ఊహించని పరిణామాలకు వేదిక రాజకీయం ..సమీకరణాలు అక్కడ మారినంత వేగంగా మరెక్కడా మారవు .ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి ..వైసీపీ లోకి వస్తారన్న వార్తలు రాగానే టీడీపీ హైకమాండ్ అలర్ట్ అయిపోయింది.ఆయనకు కౌంటర్ గా ఎవరిని ప్రయోగించాలి అని కుస్తీ పట్టింది .ఓ నేత పేరు దాదాపు ఖరారు చేసింది . అయితే ఆ నేత ఇప్పుడు ఆ పార్టీ లో కూడా లేడు. ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది .ఇంతకీ ఆ నేత మరెవరో కాదు ..ఒకప్పుడు వుండవల్లితో కలిసి పనిచేసిన సబ్బం హరి ..

ఇంతకీ టీడీపీ ఈయన కోసం ఇంతలా ప్రయత్నించడానికి ఓ కారణం ఉంది. ఉత్తరాంధ్రలో కుల సమీకరణాలు ..విశాఖ ఎన్నికలు అనుకుంటాన్నారా? వీటికి మించిన కారణం ఇంకోటి ఉంది ..అదేంటో తెలుసా? సబ్బం వాగ్ధాటి ..ఔను నిజం ..ఉండవల్లి మాటల పుట్ట ..ఎలాంటి విషయాన్నైనా తన వాక్చాతుర్యం తో సులువుగా చెప్పగలరు ..ఇప్పటిదాకా వైసీపీ అలాంటి నేతలు లేక ఇబ్బంది పడింది .అంబటి,వాసిరెడ్డి పద్మ లాంటి నేతల ప్రకటనలు అంతంత మాత్రం ప్రభావమే చూపాయి .ఇప్పుడు నిజంగా ఉండవల్లి రంగం లోకి దిగితే ..ఆ ప్రశ్నలకి ధీటుగా సమాధానం ఇచ్చే నేత కావాలి ..ఊరకే అరిస్తే లాభం ఉందదు ..విషయం మీదే సూటిగా మాట్లాడాలి …అలాంటి లక్షణాలు మెండుగా వున్న సబ్బం మీద టీడీపీ కన్ను పడింది .ఆయన వుండవల్లిని ధీటుగా ఎదుర్కోగలరని దేశం భావిస్తోంది .పైగా ఒకప్పుడు జగన్ కి దగ్గరగా వ్యవహరించడం సబ్బం కున్న అదనపు అడ్వాంటేజ్ .అందుకే ఈ అస్త్రం కోసం టీడీపీ ప్రయత్నం ..అది ఫలిస్తే ..మళ్ళీ టీవీల్లో ధీటైన రాజకీయ చర్చలు చూసే అవకాశం తెలుగు ప్రజలకు దక్కుతుంది .

 

Leave a Reply