ఉండవల్లి గారూ… విభజన కేసు ఏమైంది.?

 undavalli said implid chandrababu cash-for-vote case

లేడికి లేచిందే పరుగు అన్నట్లు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నింటా తానే అంటున్నారు.. ఒకప్పుడు వైస్ అండతో, మార్గదర్శి కేసుతో పెరిగిపోయిన ఆయన ఇమేజ్.. విభజన దెబ్బకి డౌన్ అయింది.. రెండేళ్ళ పాటు నోరు కాస్త తగ్గించుకున్నారు.. ఇటీవల జగన్ ఆయన ఇంటికెళ్ళినప్పట్నుంచి అంతా మారిపోయింది. వైసీపీ లో చేరలేదన్న మాటే కానీ ఆ పార్టీ మాట ఈయన నోట్లోంచి తెగ ఊడి పడుతోంది..

ఇప్పుడు ఓటుకు నోటు కేసులో కూడా తాను ఇంప్లీడ్ అవుతానని ఉండవల్లి గారు సెలవిచ్చారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని.. ఆయన తప్పించుకోవడం అసాధ్యం అని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఇలా చెప్పిన ఉండవల్లి మాటల్ని చాలా మంది నమ్మారు.. ఎట్టి పరిస్థితుల్లో విభజన జరగదని చెప్పి మధ్య తరగతి జనాన్ని ప్రత్యామ్నాయం ఆలోచించుకోకుండా మాటల గారడీతో కట్టి పడేశారు. అంతా అయిపోయాక ఉండవల్లి గారి శక్తి సామర్ధ్యాలేమిటో ఆంధ్ర ప్రజలకు అర్ధం అయ్యాయి.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పనిపడతామని ఉండవల్లి కాలుదువ్వడం ఆయన ఇష్టం.. బాబు నిజంగా తప్పుచేసి ఉంటే దానికి తగిన ఫలితం అనుభవిస్తారు.. కానీ ఉండవల్లి గారూ ఈ రాజకీయ హడావిడిలో, జగన్ ప్రసన్నం చేసుకునే పనిలో పడి ఓ విషయం మర్చిపోయినట్లున్నారు.. అదేనండి.. పార్లమెంట్ లో విభజన చట్టం పాస్ అయినా కూడా కోర్టులో అది నిలబడదని చెప్పారుగా.. చెప్పడమే కాదు సుప్రీం తలుపులు కూడా తట్టారు…

విభజన జరిగి రెండేళ్లయ్యింది.. ఆ కేసు ఏమైందో ఓ సారి చెప్పండి సార్? మీ మాట నమ్మి ఇంకా విభజన చట్టం చెల్లదని నమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త తెలుసుకొంటారు… జనాన్ని ఓసారి ఓ విషయం లో మోసం చేయగలం.. కానీ అన్నిసార్లు అందర్నీ మోసం చేయలేరు.. ఈ విషయం మీలాంటి మేధావికి వేరే చెప్పాల్సిన పనిలేదు.. కానీ చెప్పించుకునే పనులు చేస్తుండడంతో తప్పడం లేదు..తాజా కేసులు కాసేపు పక్కన బెట్టి విభజన కేసు ఏమైందో కాస్త చెప్పండి.. అదేమైనా మెరుగ్గా ఉంటే నిజంగానే మీరు ఇంప్లీడ్ అవుతామని చెప్పగానే బాబు గారు కూడా భయపడతారేమో ! ఓ సారి ట్రై చేయండి..

SHARE