సెలెబ్రెటీలకు ఫోటో చిక్కు.. పాపం గడ్కరీ

Posted September 30, 2016

 union minister nitin gadkari insult fan photo

రాజకీయ నేతలు, సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు ఎక్కడికెళ్లినా చుట్టూ జనం మూగిపోతారు. వీలైతే ఓ ఆటోగ్రాఫ్ … కుదిరితే ఓ సెల్ఫీ …ఇంకా అవకాశముంటే ఓ ఫోటో… ఇలా సెలెబ్రిటీలకు రిక్వెస్ట్ మీద రిక్వెస్టులు వస్తూనే వుంటాయి. వీటిలో కొన్నిటికైనా ఓకే అనేక తప్పదు పాపం సెలెబ్రిటీలకు. ఇలా దిగిన ఫోటోల వల్ల చాలామందికి తర్వాత కాలంలో ఇబ్బందులు వచ్చిన సందర్భాలున్నాయి. ఆ ఫోటో దిగినవాడు ఏం తప్పు చేసినా ఫొటోలో సెలెబ్రిటీలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు చాలాసార్లు వచ్చాయి.

ఫొటోలతో ఇప్పటికే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెలెబ్రిటీలకు మరో సమస్య వచ్చిపడింది. పిచ్చి పిచ్చి రాతలున్న టీ-షర్ట్ లు వేసుకొచ్చే వారితో ఫోటో దిగితే ఒక్కోసారి అభాసుపాలవ్వాల్సివస్తుంది. పాపం కేంద్రమంత్రి నితీష్ గడ్కరీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అడిగాడు కదాని ఫోటో దిగిన పాపానికి ఇపుడు నితిన్ గడ్కరీ సోషల్ మీడియాలో ఇలా సమాచారం చేయాల్సి వస్తోంది. సెలెబ్రిటీలు … ఇలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త.

SHARE