Posted [relativedate]
శశికళ కి షాక్ మీద షాక్.చివరికి జైలుకి వెళ్లబోయే ముందు కూడా ఆమెకి ఓ అవమానం తప్పలేదు.ఈ మధ్యాహ్నం బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు కాన్వాయ్ తో బయలుదేరింది శశికళ.పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకి చేరుకోబోయేముందు ఊహించని పరిణామం ఎదురైంది.ఎక్కడినుంచి వచ్చారో గానీ జయ అభిమానులమని చెప్పుకున్న కొందరు హఠాత్తుగా సీన్ లోకి వచ్చి శశి కాన్వాయ్ పై దాడికి తెగబడ్డారు.కాన్వాయ్ లో వున్న కార్ల అద్దాల్ని పగలగొట్టారు.ఊహించని పరిణామంతో శశి వర్గం ఖంగుతింది.పోలీసులు కలగజేసుకుని ఆందోళనకారుల్ని చెదరగొట్టి శశి కి భద్రత కల్పించారు.
ఈ పరిణామం తర్వాత షాక్ తిన్న శశికళ కోర్ట్ లో లొంగిపోయారు.శశికళ తో పాటు ఇళవరసి కూడా కోర్టులో లొంగిపోయారు.వారి వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి జైలుకి తరలించాలని ఆదేశించారు.వైద్య పరీక్షల అనంతరం వారిని జైలుకి తరలించారు.శశికళకి జైలులో 10711 అనే నెంబర్ కేటాయించారు.