ఆ చేతి వేళ్ళు నరికేశారు..

0
345
up elections fake fingers caps use for vote

Posted [relativedate]

up elections fake fingers caps use for vote
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నది ఓ పాత సామెత.యూపీ అసెంబ్లీ ఎన్నికల పర్వాన్ని చూశాక అదెంతో నిజమో అర్ధమైంది.ఓ సారి తప్పుడు దారికి అలవాటుపడినవాళ్లు అంత తేలిగ్గా మారారని తెలిసిపోయింది.పై ఫొటోలో ఉన్న చేతి వేళ్ళు చూశారుగా..పాపం ఎవరివో ఖండఖండాలుగా చేతివేళ్ళని నరికేశారు అని మీరు సానుభూతి చూపిస్తున్నారా ? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇలా తెగిపడివున్న చేతి వేళ్ళు మనుషులవి కాదు.ప్రజాస్వామ్య వ్యవస్థవి. ఈవీఎం లతో వోటింగ్ అక్రమాలకు చెక్ పెట్టేశామని ఓ వైపు ఈసీ చంకలు గుద్దుకుంటుంటే …ఆ వ్యవహారాన్ని అపహాస్యం చేశారు అక్కడి నేతలు, పార్టీలు.వోట్ వేసాక వేసే ఇంకుముద్ర పడకుండా ఉండేందుకు ఇలా కృత్రిమ ఫింగర్ కాప్స్ తయారు చేయించారు.వీటి సాయంతో యథేచ్ఛగా పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల దొంగ ఓట్లు వేయించారు.ఇదంతా చూశాక రాజకీయ వ్యవస్థ ఈ దారుణానికి తెగబడిందనడంలో ఏమైనా సందేహముందా ?

Leave a Reply