Posted [relativedate]
రామ్ చరణ్ భార్య ఉపాసన.. మెగాకోడలిగా తెలుగు వారికి సుపరిచితురాలు. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి ఆమె వైస్ ప్రెసిడెంట్. ఈ విషయం దాదాపు అందరికి తెలిసిందే. అయితే ఆమె ఒక ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ అని మాత్రం చాలా మందికి తెలియదు. అలానే కార్పోరేట్ రంగంలో ఆమె సాధిస్తున్న విజయాల గురించి కూడా పెద్దగా బయటకు రాలేదు. కానీ ఆమెలోని బిజినెస్ మ్యానెజ్మెంట్ స్కిల్స్ ని, ఆమె సాధిస్తున్న విజయాలను ఇండియా లోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగజైన్ అయిన బిజినెస్ ఇండియా వెలుగులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా తమ మ్యాగజైన్ కవర్ పేజ్ పై ఉపాసనకీ చోటు కూడా కల్పించింది.
పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే ఉపాసన బీ పాజిటివ్ అనే పత్రికకి ఎడిటర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తోంది. అలానే సోషల్ మీడియా ద్వారా, యాక్టివిటీస్ ద్వారా హెల్త్ ని ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై ప్రచారం చేస్తూ ఉంటుంది. టో ఫిట్నెస్.. వెల్నెస్ గురించి ఈమె చేస్తున్న ప్రచారం చేస్తున్న విధానం గురించి కూడా ప్రత్యేకంగా ఈ మేగజైన్ లో ప్రస్తావించారు. ఏది ఏమైనా ఇండియా లోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగజైన్ కవర్ పేజీపై మన తెలుగు వారి కోడలి బొమ్మ రావడం నిజంగా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. హ్యాట్సాఫ్ టు ఉపాసన.