ఆలయాన్ని శుభ్రం చేసిన ఉపాసన

0
595
upasana keep as neat to domakonda temple

Posted [relativedate]

upasana keep as neat to domakonda templeమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య… ఉపాసన… తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. స్వచ్ఛంద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ తన వంతు సాయం అందిస్తుంటుంది. కాగా నిన్న శివరాత్రి సందర్భంగా ఆమె తన పూర్వీకులు దోమకొండ సంస్థానానికి సంబందించిన అతి పురాతన శివాలయాన్ని దర్శించుకుంది.

ఈ ఆలయ సమీపంలో తన పూర్వీకులు 400 ఏళ్ల క్రితం దోమకొండ కోటను నిర్మించారని ఉపాసన తెలిపింది. ఈ ఆలయానికి ఏంతో విశిష్టత ఉందని, తనకు సమయం దొరికినప్పుడల్లా ఈ ఆలయాన్ని దర్శించుకొంటానని,  స్వయంగా తన  చేతులతో గుడిన కడుతానని వివరించింది. దేవుడు విరాళాలు కోరుకోడని,  భక్తుల నుంచి భక్తి, శుభ్రతను కోరుకొంటాడు కాబట్టి  అందరూ దేవాలయాలను శుభ్రంగా ఉంచాలని కోరింది.

ఇటీవల ఓ మీడియాకి ఇంటర్ వ్యూ ఇచ్చి వార్తల్లో నిలిచిన ఉపాసన తాజాగా గుడిని కడుగుతానంటూ మరో సారి సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఇంత ఆస్తి, పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా ఆమె నిరాడంబర ఆలోచనలకి హ్యాట్సాఫ్ కొడుతున్నారు నెటిజన్లు.

Leave a Reply