Saturday, December 4, 2021
HomeEntertainmentCinema Latest‘డీజే’పై ఉపేంద్ర ‘బ్రహ్మణ’ మేకర్స్‌ కామెంట్స్‌

‘డీజే’పై ఉపేంద్ర ‘బ్రహ్మణ’ మేకర్స్‌ కామెంట్స్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఉపేంద్ర హీరోగా నటించిన ‘బ్రహ్మణ’ చిత్రంతో పోలిక ఉన్నట్లుగా అనిపిస్తుంది అనే వాదన వినిపిస్తుంది. ‘బ్రహ్మణ’ చిత్రం కథ మాదిరిగానే ‘డీజే’ ఉండబోతుందనే ప్రచారం సోషల్‌ మీడియాలో ప్రస్తుతం జోరుగా జరుగుతుంది. ఈ ప్రచారంపై చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ‘బ్రహ్మణ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత మాత్రం సినిమా విడుదల తర్వాత అసలు విషయం తెలుస్తుందని చెప్పుకొచ్చాడు.

‘బ్రహ్మణ’ చిత్రం కథకు ‘డీజే’ కథకు పోలిక ఉంటే తప్పకుండా కాపీ రైట్‌ చట్టంను ఉల్లంగించినందుకు వారిపై కేసు పెడతామని, అయితే ట్రైలర్‌ను చూసి కేసు పెట్టలేమని ‘బ్రహ్మణ’ మేకర్స్‌ అంటున్నాడు. ఈనెల 23న ‘డీజే’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బ్రహ్మణులు ఈ సినిమాలోని ఒక పాటపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆ పాటలోని బ్రహ్మణులు అభ్యంతరం చెప్పిన పదాలను తొలగించడం జరిగింది. సినిమా విడుదల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి.

- Advertisment -
spot_img

Most Popular