సోగ్గాడి మీద కన్నేసిన ఉపేంద్ర

0
394
upendra to remake soggade chinni nayana in kannada

 Posted [relativedate]

upendra to remake soggade chinni nayana in kannadaకన్యాదానం సినిమా గుర్తింది కదూ. ఇందులో శ్రీకాంత్, ఉపేంద్ర హీరోలుగా నటించారు. అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ కంటే ఉపేంద్ర నటనకే మంచి పేరు వచ్చిందన్నది ఒప్పుకోవాల్సిన నిజం. ఆ తర్వాత తెలుగులో రెండు మూడు సినిమాల్లో తళుక్కుమన్న ఉపేంద్ర చాలా కాలం తర్వాత S/O సత్యమూర్తి సినిమాలో ఓ కీలక రోల్లో నటించాడు. అయితే నువ్వునాకు నచ్చావ్, దుబాయ్ శీను  వంటి పలు తెలుగు హిట్ సినిమాలను కన్నడలో రీమేక్ చేసి అక్కడ విజయం సాధించాడు. తాజాగా ఈ హీరో గారి కన్ను సోగ్గాడే చిన్నినాయన సినిమా మీద పడిందట.

2016లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటించిన  సోగ్గాడే చిన్ని నాయన చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేయబోతున్నాడు ఉపేంద్ర.  డ్యుయల్ రోల్ తనకు బాగా కలిసి వస్తుందని భావించిన  ఉపేంద్ర త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట. గతంలో నాగ్ నటించిన మన్మధుడు సినిమాతో కన్నడలో భారీ హిట్ కొట్టిన ఉపేంద్ర సోగ్గాడిగా ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Leave a Reply