నేడే యూఎస్‌ ఎన్నిక సంగ్రామం..

0
428
us elections arraived
Posted [relativedate]
us elections arraivedప్రపంచంలోని పెద్ద నగరాలు మొదలుకుని కుగ్రామాల వరకు ఒకటే చర్చ.. అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని.. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై పరోక్షంగా ప్రభావం చూపే ఈ ఎన్నికపై మీడియా సైతం విస్తృత స్థాయి ప్రచారం ఇవ్వడం కూడా ఆసక్తిని రేకెత్తిచడం ఒక కారణం కావొచ్చు.. ఏదిఏమైనా అందరూ అమెరికా పోరు గురించి తెలుసుకునేందుకు అమితాశక్తిని కనబరుస్తున్నారు.. వారందరికోసం ‘తెలుగుబుల్లెట్‌’ అందింస్తున్న ప్రత్యేక కథనం..
అమెరికా భవిష్యత్తును నిర్దేశించే కొత్త అధ్యక్ష ఎన్నిక మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. భారత కాలమాన ప్రకారం ఆ రోజు సాయంత్రం 4.30 నుంచి మొదలవుతుంది.. దాదాపు 12 కోట్ల మంది తమ ఓటు హక్కు నిర్వహించుకోనున్నారు. 
రేసులో ఎవరు..
us elections arraivedయూఎస్‌ 45వ అద్యక్ష రేసులో డెమక్రటిక్‌ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్‌ పోటీ పడుతున్నారు. 69 ఏళ్ల ఈ వనిత గెలిస్తే కొత్త చరిత్ర సృష్టించి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రకెక్కుతారు. 1993 నుంచి 2001 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్‌క్లింటన్‌ భార్య.. 2001 నుంచి 2009 వరకు వివిధ హోదాల్లో సెనెట్‌కు పనిచేశారు. విదేశాంగశాఖలో చేయడం వల్ల భవిష్యత్తు వ్యూహాలపై స్పష్టతతో ఉన్నారు. దాని మూలంగానే ఓపెన్‌ డిబెట్‌లో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టగలిగారు..
ఇక రెండో అభ్యర్థి రిపబ్లికన్‌ పార్టీ నుంచి 70 ఏళ్ల డోనాల్డ్‌ ట్రంప్‌  బరిలో ఉన్నారు. ఈయన అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగ్నెట్‌.. రచయిత.. టె లివిజన్‌ పర్సనాలటీ.. ది ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు ప్రెసిడెంట్‌గా, ట్రంప్‌ ఎంటర్‌టైనమెంట్‌ రిసార్ట్స్‌ వ్యవస్థాపకుడుగా ఉన్నారు. వివాదస్పాద వ్యాఖ్యలతోనే ఈయన  పాపులర్‌ అయ్యారు.. ‘ముస్లిం వల్లే ఉగ్రవాదం పెరుగుతుంది.. నేను గెలిస్తే వారిని దేశంలోకి రానీయకుండాచేస్తా’ వంటి వ్యాఖ్యలు వందల్లో చేస్తుంటారు.. ముఖ్యంగా ఈయన ప్రవర్తనకు ప్రత్యేర్థి దేశాలు స్వాగతించడం గమనార్హం..ప్రచారం వివాదమే..

us elections arraived

ఎన్నడు లేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు వ్యక్తిగత దూషనలకు కేంద్రగా మారింది.. మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తాడని ట్రంప్‌పై హిల్లరీ విరుచుకుపడితే… పిచ్చి విధానాలతో దేశానికే చేటు తెస్తుంది.. ఈమెయిల్‌ స్కామే దానికి నిదర్శం… నేను గెలిస్తే దేశంలోనే ఉండనివ్వనని హిల్లరీపై ట్రంప్‌ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా ప్రతి అంశాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు.ప్రీ పోల్‌ సర్వేలు ఆశ్చర్యమే..

అధ్యక్ష ఎన్నికల్లో ప్రీపోల్‌ సర్వేలు చాలా కీలకంగా ఉంటాయి.. ఈ సారి ఇవి కూడా గెలుపుపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.. మొదట్లో హిల్లరీవైపు విజయావకాశాలు చూపినా క్రమంగా ఆధిక్యత తగ్గుతూ వచ్చి ట్రంప్‌ పై చేయి సాధించినట్లుగా ఎక్కువ సర్వేలు తేల్చాయి.. మళ్లీ చివర్లో హిల్లనీ పుంజుకుని నువ్వానేనా అన్న రీతిలో పోటీలో నిలబడ్డారు. దీంతో విజయం ఎవరివైపు మొగ్గుతుందో తేలని పరిస్థితి ఏర్పడింది.
సంక్షేమమే డెమక్రటీల విధానం..
us elections arraivedడెమక్రటీ పార్టీ మొదటి నుంచి సంక్షేమానికే పెద్ద పీట వేస్తుంటారు. ప్రజాధనాన్ని పెద్దపెద్ద ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఖర్చుచేసేందుకు సుముఖంగా ఉంటారు. తుపాకుల వాడకంపై నియంత్రణ ఉండాలనేది వారి సిద్ధాతం.. మహిళల హక్కులపైనా స్పష్టమైన విధానం.. యూనివ ర్సల్‌ హెల్త్‌కేర్‌పైనా సుముఖంగా ఉంటారు.. ఎక్కువగా ఉత్తర రాష్ట్రాల్లో పార్టీకి మంచి పట్టుంది.. ముఖ్యంగా పెద్ద నగరాలు, కోస్తా తీరంలో ఉండే రాష్ట్రాల్లో బలంగా ఉన్నారు.. ఈపార్టీ నుంచే బరాక్‌ ఒబామా, బిల్‌క్లింటన్‌, జాన్‌ కెనడీ, రూస్వెల్ట్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు..రిపబ్లికన్స్‌.. రైట్‌వింగే..
అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీఅంటే చాలా ఘనమైన పురాతన పార్టీ అని చెప్పొచ్చు.. చాలా అగ్రేసివ్‌గా.. రైట్‌వింగ్‌ పార్టీగా దీనికి గుర్తింపు ఉంది.. వీరు తుపాకుల నియత్రంణకు వ్యతిరేకం.. వలస వచ్చేవారిని నియంత్రించాలనేది వీరి విధానం.. చిన్న ప్రభుత్వాలు బావుంటేనే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతారు.. దక్షిణాది రాష్ట్రాల్లో మంచి పట్టున్న పార్టీ.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరగని అభిమానం ఈ పార్టీ సొంతం.. అబ్రహం లింఖన్‌, రోనాల్డ్‌ రీగన్‌, నిక్సాన్‌, జార్జి బుష్‌ వంటి నాయకులు అధ్యక్ష పీఠాలు అధిహించింది ఈ పార్టీ తరఫునే..మ్యాజిక్‌ ఫిగర్‌.. 269 ఎలక్టోరల్‌ ఓట్లు
ఎన్నికల్లో నేరుగా అధ్యక్షులను ఎన్నుకోలేరు.. మొదట వారు ఎలక్టోరల్‌లను ఎన్నుకోవాలి… ఆ తరవాత అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే 269 ఎలక్టోరల్‌ ఓట్లు రావాల్సి ఉంటుంది. 12 గంటల పాటు జరిగే ఈ ఎన్నికలు పూర్తిఅయినవెంటనే కౌంటింగ్‌ ప్రారంభిస్తారు. తొలి ఫలితం న్యూహ్యాంప్‌షైర్‌లోని డిగ్జ్‌విల్లే నాచ్‌ నుంచి వెలువడుతుంది. కెనడా సరిహద్దుల్లో ఉండే ఇక్కడ అర్ధరాత్రి నుంచే ఎన్నికలు ప్రారంభమవుతాయి.. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులూ న్యూయార్క్‌ నుంచే ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

                                                                                                             – శ్రీ

 

Leave a Reply