రియో ఒలింపిక్స్‌లో పరుగుల వీరుడు, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ చరిత్రలో తన పరుగుతో అభిమానులను ఉర్రూతలుగించిన బోల్ట్.. 400 మీటర్ల రిలే పరుగులోనూ మరో స్వర్ణం సాధించాడు.మూడు ఈవెంట్లలో బంగారు పతకం సాధించాడు. పురుషుల 400 మీటర్ల రిలేలో అసఫా పావెల్, బ్లేక్, అస్మెది, బోల్ట్‌తో కూడిన బృందం విజయం సాధించింది.
దీంతో బోల్ట్ 100 మీ, 200మీ, 400 మీ. రిలేలో వరుసుగా మూడుసార్లు స్వర్ణం సాధించినట్లైంది. పురుషుల 400 మీటర్ల రిలేను వరుసగా మూడు సార్లు సాధించిన రెండో అథ్లెట్‌గా బోల్ట్ రికార్డు సృష్టించాడు. గతంలో 1928, 1932, 1936లో అమెరికాకు చెందిన ఫ్రాంక్ వైకాఫ్ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. జమైకా బృందం 37.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణాన్ని సాధించింది. ఇక ట్రిపుల్ ట్రిపుల్ సాధించిన తొలి అథ్లెట్‌గా బోల్ట్ చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌లో 100మీ, 200మీ, 400 మీ రిలేలో స్వర్ణం సాధించిన అరుదైన ఘనతను అందుకున్నాడు.