ఆటలో చిరుత మాట..

0
645

 usain bolt like chirutha running Andre de Grasse200 మీటర్ల పరుగుపందెం.. అదీ ఒలింపిక్స్ లో అంటే.. నరాలు తెగే ఉత్కంఠ.. అంతకుమించిన వేగం.. కేవలం 20 సెకన్లలోపే లక్ష్యాన్ని చేరాలి. ఆ అతి తక్కువ సమయంలో కూడా మాట్లాడగలిగే వీలుంటుందా..? మామూలు మనుషులకైతే ఉండదు కానీ .. ఉసేన్ బోల్ట్ లాంటి చిరుతపులి లైట్ తీసుకుంటాడు.రియోలో 200 మీటర్ల పరుగుపందానికి సెమీ ఫైనల్స్ జరుగుతున్నాయి.

ఎప్పటిలాగే బోల్ట్ మెరుపు వేగంతో పరిగెట్టాడు.. అతని వెనకే ఉన్నాడు కెనడా కు చెందిన ఆండ్రీ డి గ్రాస్, ఆండ్రీ 100 మీటర్ల రేసులో కాంస్యం సాధించాడు.. ఇపుడు 200 మీటర్ల రేసులోనూ ఉన్నాడు. ఇక ఫినిషింగ్ లైన్ వస్తూందనగా బోల్ట్ పక్కకు చూశాడు.. కొద్ది దూరంలో ఆండ్రీ ఒక్కడే కనిపించాడు.. రొప్పుతూ..!మిగిలిన వారంతా బాగా దూరంలో ఉన్నారు. ఆ సమయంలో బోల్ట్ .. ఆండ్రీని ఉద్దేశించి ఓ మాటన్నాడు.. ఎందుకంత ఆవేశం.. ఇది కేవలం సెమీఫైనల్సే ..అన్నాడు..దీనికి నవ్వేశాడు ఆండ్రీ.. దీని అర్థం ..మనం ఇద్దరమే ఉన్నాం.. ఫైనల్స్ కు క్వాలిఫై అయ్యాం.. ఎందుకంత అతి వేగంగా పరిగెట్టేస్తున్నావు.. ఫినిషింగ్ లైన్ చేరిపోయాం కదా.. అని!

అదీ బోల్ట్ పవరు.. ఎంత రిలాక్స్ డ్ గా పరుగుపందెంలో పాల్గొంటున్నాడో అని ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూస్తోందతన్ని..తల తిప్పడానికి కూడా టైమ్ సరిపోని క్షణంలో పక్క ఆటగాడితో మాటలు కూడా కలిపిన బోల్ట్ నిజంగా గ్రేటే ..కాదంటారా..!

Leave a Reply