గులాబీ సీన్ రివర్స్ అవుతుందా..?

0
626
uttam kumar reddy says trs mlas touched to congress party

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

uttam kumar reddy says trs mlas touched to congress partyముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెరాస ఎమ్మెల్యేలు షాకివ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ దగ్గరి కుటుంబ సభ్యులు తప్ప తెరాసలో చాలామంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, ఎన్నికలకు ఏడాది ముందు వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వ్యాఖ్యానించారు.తెరాస నుంచి ఊహించని స్థాయిలో వలసలు కాంగ్రెస్‌లోకి ఉంటాయని చెప్పారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని చెప్పారు. వరంగల్ సభలో కేసీఆర్ బీజేపీ గురించి మాట్లాడలేదని, దాంతోనే ఆ పార్టీ బలం ఏమిటో తేలిపోయిందన్నారు.బీజేపీకి ఉత్తరాదిలో కలిసి వచ్చిన ఫార్ములా ఇక్కడ పని చేయదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చిందని,తెరాసనే ఎన్నికల మూడ్ తెచ్చిందని చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అభద్రతా భావంలో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న వారు వచ్చే ఏడాది అమలు చేస్తామంటూ హామీలు ఇవ్వడం ఏమిటని ఎద్దేవా చేశారు.

ఉస్మానియా వర్సిటీలో ముఖ్యమంత్రి, గవర్నర్ మాట్లాడకపోవడం రాష్ట్రపతిని అవమానించడమే అన్నారు. ఖమ్మంలో రైతులు కడుపుమండి ఆందోళన చేస్తే రౌడీలు అని వ్యాఖ్యానించడం విడ్డూరం అన్నారు. రైతులకు అండగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఉండటం తెరాస జీర్ణించుకోలేకపోతోందని, భయపడుతోందన్నారు.తెరాస నాయకులకు తన గడ్డం ఒక హాట్‌ టాపిక్‌గా మారిపోయిందని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు.

Leave a Reply