దర్శకేంద్రుడి మొహానికి రంగేయమన్న వినాయక్ ..

0
502
v.v.vinayak suggested to dil raju sathamanam bhavathi movie prakash raj role raghavendra rao is perfect

Posted [relativedate]

v.v.vinayak suggested to dil raju sathamanam bhavathi movie prakash raj role raghavendra rao is perfect
శతమానం భవతి …ఇద్దరు తెలుగు సినీ దిగ్గజాల సినిమాల తో పోటీపడి తాను ఓ సంక్రాంతి విజేతగా నిలిచిన చిత్రం. ఆ చిత్ర విజయోత్సవ సభతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి.వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైంది శతమానం భవతి సినిమాతో సంక్రాంతికి పోటీపడిన ఖైదీ నెంబర్ 150 దర్శకుడు వినాయక్ ఇచ్చిన సలహా.ఈ సినిమా కథ వినిపించిన దిల్ రాజు ఇప్పుడు ప్రకాష్ రాజ్ వేసిన క్యారెక్టర్ కి ఎవరు సూట్ అవుతారని వినాయక్ ని అడిగారట.అందుకు వినాయక్ ఎవరి పేరు చెప్పారో తెలుసా ? దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు పేరు సజెస్ట్ చేశారు.ఆయన ఒప్పుకుంటే ఆ క్యారెక్టర్ బాగుంటుందని వినాయక్ చెప్పారట.

ఆ విధంగా దర్శకేంద్రుడి మొహానికి రంగు వేద్దామని వినాయక్ కి ఆలోచన వచ్చింది.అయితే ఏమి జరిగిందో ఏమిటో చివరికి ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ తెరపైకి వచ్చాడు.ఆ తరం దర్శకుల్లో దాసరి కి మొదటి నుంచి నటించే అలవాటుంది.ఇక కమల్ హాసన్,బాలసుబ్రమణ్యం ఒత్తిడితో కె.విశ్వనాధ్ కూడా శుభసంకల్పం తో ఓ నటుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు.ఇక నటన విషయం పక్కనబెడితే వేదికపై మాట్లాడకుండానే దాదాపు మూడు దశాబ్దాలకి పైగా నెట్టకొచ్చిన రాఘువేంద్ర రావు గడిచిన రెండుమూడేళ్లుగా కొంచెం నోరు తెరిచి మాట్లాడుతున్నారు.అది కూడా తన దర్శక అనుభవాలని నేటితరానికి పంచడానికి ఈ టీవిలో ఓ కార్యక్రమం తో ఆయన పబ్లిక్ లో నోరు విప్పడం మొదలెట్టారు.ఇక వినాయక్ సలహా పాటించి ఆయన వెండితెర మీద కూడా కనిపిస్తే ఓ సంచలనమే ..ఆ ఘనత ఎవరు సాధిస్తారో …ఏమో ?

Leave a Reply