ఎన్టీఆర్ ని వీడిన వక్కంతం..?

0
883
vakkantham vamsi left ntr

vakkantham vamsi left ntr

రెండు రోజుల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమా టైటిల్ దడ్కన్ అని వక్కంతం వంశీ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో కాని ఎన్.టి.ఆర్ నుండి వక్కంతం దూరం వెళ్తున్నాడని టాక్. ఇద్దరి మధ్య ఏ విషయంలో సఖ్యత చెడిందో తెలియదు కాని ఇన్నాళ్లు ఎన్టీఆర్ తో సినిమా తీయాలని హోప్స్ పెట్టుకున్న వక్కంతం వంశీకి తారక్ మళ్లీ హ్యాండ్ ఇచ్చేశాడట. జనతా రిలీజ్ టైంలో తారక్ నటిస్తున్న తర్వాత సినిమా టైటిల్ దడ్కన్ అని వచ్చేసరికి ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహం కలిగింది.

అయితే తారక్ ప్రమేయం లేకుండానే ఆ టైటిల్ ఎనౌన్స్ చేశాడని వక్కంతం మీద జూనియర్ సీరియస్ అయ్యాడట. ఇక తన సినిమా ఆశలను కూడా వదులుకోవాలన్నట్టు సంకేతాలిచ్చాడట. అందుకే వక్కంతం వంశీ తారక్ కాంపౌండ్ నుండ్ బయటకు వచ్చేశాడని హాట్ న్యూస్ నడుస్తుంది. ఇక మరో పక్క మాత్రం ఇన్నాళ్ల నుండి తన సినిమా కోసం ఎదురుచూస్తున్న వంశీని ఇంకా జూనియర్ వెయిట్ చేయించే ఆలోచనలో ఉన్నాడట అందుకే ఇక ఓపిక పట్టలేక వేరే హీరోతో సినిమా ప్రయత్నాలు చేసేందుకే వంశీ అవుట్ అయ్యాడని అంటున్నారు. తారక్ చేసిన చాలా సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ డైరక్టర్ గా మారేందుకు దాదాపు రెండేళ్ల నుండి వెయిట్ చేస్తున్నాడు.

Leave a Reply