వర్మకి రక్తచరిత్ర 3 ఐడియా ఆ ఎమ్మెల్యే ఇచ్చిందందుకే..

 Posted October 24, 2016

vallabhaneni vamshi giving idea to ram gopal varma do rakta charitra 3 movieబయోపిక్ లు తీయడంలో బిజీ బిజీ గా ఉన్న రామ్ గోపాల్ వర్మకి రక్తచరిత్ర 3 తీసే ఆలోచన ఉందా? ఆయనికి ఉందోలేదో తెలియదుగానీ ఓ ఎమ్మెల్యే మాత్రం ఆయనకి ఆ సలహా ఇచ్చారు.అది జరిగి కూడా కొన్నేళ్లు గడిచింది.పరిటాల రవి హత్యకేసు నిందితుడు సూరి తన అనుచరుడు భాను కిరణ్ చేతుల్లో చనిపోయినపుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ పార్టీ ఇచ్చారు.ఆ పార్టీ జరుగుతున్నప్పుడే అక్కడనుంచి వంశీ ఫోన్ చేసాడంట.మీ స్నేహితుడు చనిపోయాడు కదా ఇప్పుడు రక్తచరిత్ర 3 తీయమని చెప్పాడంట.వంశీ ఆలా చేయడం వెనుక కారణం రక్తచరిత్ర 2 అని తెలుస్తోంది.

రక్తచరిత్ర రెండో భాగంలో సూరి పాత్రని పాజిటివ్ గా ,రవి క్యారెక్టర్ ని కొంత నెగటివ్ గా చూపడం వంశీకి ఏ మాత్రం నచ్చలేదంట.ఒకప్పుడు రవికి సన్నిహితంగా మెలిగిన వంశీ హర్ట్ అయ్యాడు.పైగా ఆ సినిమా షూటింగ్ టైం లో సూరి తో వర్మ క్లోజ్ గా మెలగడం వంటి పరిణామాలు నచ్చని వంశీ ఆ పార్టీ మూడ్ లో వర్మకి ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేసాడంట.

SHARE